Chandrababu: చంద్రబాబు విమర్శలు హద్దులు దాటుతున్నాయా.. వెన్నుపోటు నిజం కాదా?

Chandrababu: ఏపీ సీఎం జగన్ ప్రతిసారి ఏ విధంగా అయితే పవన్ కళ్యాణ్ ముగ్గురు భార్యల విషయం గురించి పదే పదే ప్రస్తావిస్తూ పవన్ కు కోపం తెప్పిస్తున్నారు. అయితే ఇప్పుడు చంద్రబాబు లోకేష్ కూడా అలాంటి పనే చేస్తున్నారు. చంద్ర‌బాబు,లోకేశ్ ప‌దేప‌దే ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ త‌ల్లి, చెల్లి ప్ర‌స్తావ‌న తెస్తున్నారు. త‌ల్లి, చెల్లికి న్యాయం చేయ‌లేని ముఖ్య‌మంత్రి స‌మాజానికి ఏం చేస్తారంటూ నిల‌దీస్తున్నారు. జగన్ తన సొంత కుటుంబ స‌భ్యుల్ని ప‌ట్టించుకోర‌ని, అలాంట‌ప్పుడు ప్ర‌జ‌ల యోగ‌క్షేమాల‌ను ఎలా ప‌ట్టించుకుంటార‌నే నెగెటివ్ ఆలోచ‌న‌ను ఇంజెక్ట్ చేసేందుకు టీడీపీ వ్యూహాత్మ‌కంగా విమ‌ర్శ‌లు చేస్తోంది.

ఇప్పటికే ఈ విషయాన్ని చాలా సార్లు ప్రస్తావించింది. కాగా ఈ క్రమంలోనే టీడీపీ నేత‌ల‌కు వైసీపీ గ‌ట్టిగా స‌మాధానం ఇస్తోంది. పిల్ల‌నిచ్చిన మామ‌నే అధికారం కోసం వెన్నుపోటు పొడిచి, మాన‌సికంగా హింసించి, ఆయ‌న మ‌ర‌ణానికి ప‌రోక్షంగా కార‌ణ‌మైన చంద్ర‌బాబు, ఇవేవీ తెలియ‌ని మాలోకం లోకేశ్ జ‌నాన్ని ఉద్ధ‌రిస్తారా? అంటూ కౌంట‌ర్ ఇస్తున్నారు. చంద్ర‌బాబు గురించి ఎన్టీఆర్ నాడు చేసిన ఘాటు కామెంట్స్‌ను విస్తృతంగా సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం చేస్తున్నారు. చంద్రబాబు జగన్ తల్లి చెల్లి గురించి ప్రస్తావిస్తుండగా,వైసీపీ నేతలు చంద్రబాబు నాయుడు సీనియర్ ఎన్టీఆర్ కి పొడిచిన వెన్నుపోటు గురించి ప్రస్తావన తీసుకు వస్తున్నారు.

 

చంద్ర‌బాబు నాయుడు, లోకేశ్ త‌మ గురించి లోకానికి ఏమీ తెలియ‌ద‌న్న‌ట్టుగా, నీతులు చెబుతూ సీఎం జ‌గ‌న్‌పై తీవ్ర‌మైన విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. ఇదే వైసీపీ నేత‌లు చంద్ర‌బాబు కుటుంబ స‌భ్యుల గురించి మాట్లాడితే గ‌గ్గోలు పెడుతున్నారు. టీడీపీ నేత‌లు మాత్రం నిత్యం జ‌గ‌న్ కుటుంబంలోని మ‌హిళ‌ల గురించి ప్ర‌స్తావిస్తూ రాజ‌కీయ ప‌బ్బం గ‌డుపుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. ఇందులో చంద్ర‌బాబు, లోకేశ్ ఆరితేరారు. రాజ‌కీయ భ‌విష్య‌త్ ఇచ్చిన మామ‌కు త‌న తండ్రిలా వెన్నుపోటు పొడిచిన మ‌రే నాయ‌కుడు లేర‌ని లోకేశ్‌కు తెలియ‌ద‌ని అనుకోవాలా? అంటూ నెటిజ‌న్స్,వైసీపీ నేతలు ప్ర‌శ్నిస్తున్నారు.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -