Chandrababu Naidu: వచ్చే ఎన్నికల్లో వారందరిటీ టికెట్లు.. చంద్రబాబు సంచలన ప్రకటన

Chandrababu Naidu: టీడీపీ అధినేత చంద్రబాబు స్పీడ్ పెంచారు. అభ్యర్థుల ఎంపికను వేగవంతం చేశారు. ఇప్పటినుంచే అభ్యర్థులను ఫిక్స్ చేస్తున్నారు. నేతలకు టికెట్ల కేటాయింపుపై క్లారిటీ ఇస్తున్నారు. ముందుగానే టికెట్ కన్ఫామ్ చేస్తే యాక్టివ్ గా పనిచేస్తారని, ఇప్పటినుంచే ప్రచారం చేసుకోవడం వల్ల పార్టీకి లాభం జరుగుతందని చంద్రబాబు భావించారు. అందుకే గతానికి భిన్నంగా ఏడాదాన్నర ముందే నేతలకు టికెట్లు కేటాయిస్తున్నారు. కొంతమంది నేతలకు ప్రత్యక్షంగా టికెట్ కన్ఫామ్ అని చంద్రబాబు చెబుతుండగా.. మరికొంతమందికి పరోక్షంగా సంకేతాలు ఇస్తున్నారు.

అయితే తాజాగా చంద్రబాబు సంచలన ప్రకటన చేశారు. టీడీపీలోని సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ టికెట్లు ఫిక్స్ చేస్తున్నట్లు ప్రకటించారు. అసెుంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేసేందుకు టీడీఎల్పీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు. వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ టికెట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వ వైఫల్యాలపై బాగా పోరాడుతున్నారని, ప్రజా సమస్యలపై గట్టిగా ప్రశ్నిస్తున్నారని కితాబు ఇచ్చారు.

ఏపీలో ముందస్తు ఎన్నికలు వస్తాయనే ప్రచారం గత కొంతకాలంగా జరుగుతోంది. గడపగడకు వైసీపీ కార్యక్రమంతో పాటు మూడు రాజధానుల బిల్లులపై జగన్ సర్కార్ స్పీడ్ పెంచడంతో ముందస్తు ఎన్నికలు వస్తాయనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వంపై వ్యతిరేకత పెరగుతుండటం, పొత్తుకు టీడీపీ, జనసేన ప్రయత్నాలు చేస్తుండటంతో.. ఆ రెండు పార్టీలకు సమయం ఇవ్వకుండా ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని జగన్ చూస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే ముందుగానే చంద్రబాబు టికెట్లు ఫిక్స్ చేశారనే ప్రచారం జరుగుతోంది.

అయితే వచ్చే ఎన్నికల్లో టికెట్ల కేటాయింపుపై చంద్రబాబు ఇప్పటికే నేతలకు క్లారిటీ ఇచ్చారు. వరుసగా ఓడిపోయే సీనియర్ నేతలకు టికెట్లు కేటాయించేది లేదని చెప్పుకొచ్చారు. సీనియర్ నేతలు పార్టీ కోసం పనిచేయాలని సూచించారు. యువ నేతలకు 30 సీట్లు కేటాయిస్తామని చంద్రబాబు తెలిపారు. ఇక ఒకే కుటుంబంలో ఒకరికే మాత్రమే టికెట్ ఇస్తామని, ఒకే కుటుంబం నుంచి ఇద్దరికి టికెట్లు ఇవ్వడం కుదరదని తేల్చిచెప్పారు. పార్టీ కోసం పనిచేసేవారికే, ప్రజల్లో ఆదరణ ఉన్నవారికే టికెట్లు ఇస్తానని, ఇందులో మొహహాటం లేదని చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు.

ఇక గతంలో మహానాడులో ఎమ్మెల్సీ లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. వరుసగా మూడుసార్లు ఓడిపోయిన వారికి టికెట్లు ఇచ్చేది లేదని చెప్పుకొచ్చారు. ఇక పార్టీ పదవులు కూడా ఎవరికైనా రెండుసార్లే దక్కుతాయని తెలిపారు. తన విషయంలో కడా అదే వరిస్తుందని చెప్పారు. వచ్చేసారి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తాను తప్పుకుంటానని లోకేష్ తెలిపారు. సీనియన్ నేతలు ఏళ్ల తరబడి పదవుల్లో ఉంటే యువకులకు అవకాశాలు ఎలా దక్కుతాయన్నారు. పనిచేయని నేతలకు ఇంచార్జ్ పదవులు ఉండని తేల్చిచెప్పారు.

చంద్రబాబు, లోకేష్ వ్యాఖ్యలు చూస్తే రెండు ఒకేలా ఉన్నాయి. ఈ సారి టీడీపీలో చాలామంది సీనియర్ నేతలకు టికెట్ లేనట్లేనని తెలుస్తోంది. యువకులకు 30 టికెట్లు ఇస్తానని ఇప్పటికే చంద్రబాబు ప్రకటించారు. దీంతో ఈ సారి టీడీపీలో యువకులకు చంద్రబాబు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తన్నట్లు తెలుస్తోంది. అందుకే నేతలకు ఇప్పటినుంచే టికెట్లపై క్లారిటీ ఇస్తున్నారు. ఎన్నికల కోసం ఎవరిని ఎలా వాడుకోవాలనే దానిపై ప్రణాళికలు రూపొందించారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -