Chandrababu Naidu: ఇక చాలు.. వైసీపీ నేతలు మాకు వద్దు.. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు వైరల్!

Chandrababu Naidu: మరి కొద్ది రోజులలో ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున రాజకీయ నాయకులు కూడా పార్టీ మారుస్తూ ఉన్నారు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ నుంచి కొందరు సీనియర్ నాయకులు వైసిపి పార్టీలోకి చేరగా వైసిపి నుంచి మరికొందరు తెలుగుదేశం పార్టీలోకి మారుతున్నారు. ఇలా కొంతమంది నాయకులు పార్టీ మారుతున్నటువంటి తరుణంలో చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు.

ఇప్పటికే వైసీపీ పార్టీ నుంచి చాలామంది తమ పార్టీలోకి వచ్చారు. మరి కొందరు కూడా నాతో టచ్ లో ఉన్నారు. అయితే వారందరికీ ఆహ్వానం పలకలేమంటూ చంద్రబాబు నాయుడు కామెంట్స్ చేశారని ఓ టిడిపి నాయకుడు వెల్లడించారు. ఇలా పక్క పార్టీ నుంచి తమ పార్టీలోకి వస్తున్న వారందరూ టికెట్లు కూడా ఆశిస్తున్నారని చంద్రబాబు నాయుడు వెల్లడించారు.

ఇలా వచ్చిన వారందరికీ టికెట్లు ఇచ్చుకుంటూ పోలేమని ఈయన స్పష్టం చేశారట. ఇప్పటికే పొత్తు ఉండటంతో సీట్లు సర్దు బాటు చేయలేక చాలా మంది సీనియర్ నేతలకు నిరాశ ఎదురయింది ఇకపై వచ్చిన వారికి ఆహ్వానం పలికి వారికి టికెట్లు ఇవ్వదలుచుకోలేదని తెలిపారు. ఎన్నికలకు సుమారు 56 రోజులు మాత్రమే గడువు ఉన్నటువంటి తరుణంలో ఈ కొద్ది రోజులలో పక్క ప్రణాళికలతో వ్యవహరించాలని ఈయన సీనియర్ నేతలకు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు దిశా నిర్దేశం చేశారని తెలుస్తోంది.

ఇప్పుడు మనం ఎంతో కష్టతరమైనటువంటి యుద్ధం చేసే సమయంలో ఉన్నాము ఇలాంటి సమయంలో బలమైన నాయకులను ఎన్నుకొని యుద్ధంలో గెలవాలని అందుకే అందరికీ టికెట్లు ఇవ్వలేక కీలకమైనటువంటి వారికి మాత్రమే టికెట్లు ఇస్తున్నామని తెలిపారు. ఇక పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి ఏదో ఒక విధంగా న్యాయం చేస్తామని చంద్రబాబు నాయుడు తెలిపారు. ఇప్పటికే రా కదలిరా కార్యక్రమం ముగిసిందని ప్రస్తుతం శంఖారావం జరుగుతుందని త్వరలోనే సరికొత్త ప్రణాళికలతో ముందుకు వెళ్లి ఎన్నికలను ఎదుర్కోవాలని చంద్రబాబునాయుడు దిశా నిర్దేశం చేసినట్టు తెలుస్తుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -