Chandrababu Naidu: కుప్పంలో చంద్రబాబుకు రికార్డ్ స్థాయిలో మెజార్టీ ఖాయమా.. బాబుకు తిరుగులేదా?

Chandrababu Naidu:  మరికొద్ది రోజులలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో అందరి ఆసక్తి ఏపీ ఎన్నికలపైనే ఉంది. జగన్మోహన్ రెడ్డి సింగిల్ గా రాగా మరోవైపు జనసేన టిడిపి బిజెపి కూటమిగా ఏర్పడి ఎన్నికల బరిలోకి రాబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఇలా మూడు పార్టీలు ఒకవైపు జగన్ ఒకవైపు వస్తున్నటువంటి తరుణంలో జగన్మోహన్ రెడ్డి ఈసారి కుప్పంలో కూడా తమ పార్టీ ఎగరబోతుందని ధీమా వ్యక్తం చేశారు.

ఇలా జగన్మోహన్ రెడ్డి వై నాట్ కుప్పం అని చెప్పగా చంద్రబాబు నాయుడు సైతం ఒకింత ఆందోళనకు గురయ్యారు. ఇలా చంద్రబాబు నాయుడు కుప్పంలో ఓడిపోతే అది పెద్ద అవమానమే అని చెప్పాలి..కానీ రాజకీయాలు అన్న తర్వాత ఎప్పుడు ఎలా మారుతాయో ఎవరికీ తెలియదు. 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గంలో ఓడిపోతే అవమానకరంగా ఉంటుంది కనుక చంద్రబాబు నాయుడు తన రాజకీయ వ్యూహాలను అమలుపరుస్తూ వచ్చారు.

అయితే ఎలక్షన్స్ నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి కుప్పంలో కూడా రాజకీయాల పూర్తిగా మారిపోయాయని తెలుస్తుంది. ఒకప్పుడు వై నాట్ కుప్పం అన్నటువంటి వైసిపి ప్రస్తుతం ప్రచార కార్యక్రమాలకు కూడా వెనకడుగు వేస్తోంది. ఇప్పటికే చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గంలో పర్యటించడమే కాకుండా తన భార్య భువనేశ్వరితో నామినేషన్ కూడా వేయించారు.

ఈ నామినేషన్ భారీ స్థాయిలో ప్రజలు తరలివచ్చి నామినేషన్ వేయడంతోనే అక్కడ రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయనేది స్పష్టంగా తెలుస్తుంది. ఈ ర్యాలీ చూస్తేనే కుప్పంలో చంద్రబాబు నాయుడు భారీ మెజార్టీతో గెలవబోతున్నారని తెలుస్తోంది. కుప్పంలో వైసిపి అభ్యర్థి గెలిస్తే మంత్రి అవుతాడని గతంలో జగన్ చెప్పారు కానీ ప్రజలు కుప్పంలో చంద్రబాబునాయుడు గెలిస్తే ముఖ్యమంత్రి అవుతారు అంటూ పూర్తిగా పార్టీ మార్చేసారని చెప్పాలి. ఇక్కడ తెలుగుదేశం బాగా పుంజుకోవడంతో వైసిపి నేతలు కూడా రాజకీయ ప్రచార కార్యక్రమాలను చేయడానికి కూడా పెద్దగా ఆసక్తి కనబరచలేదని తెలుస్తుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -