Rayalaseema: చంద్రబాబు ఎంట్రీతో సీమలో పరిస్థితి మారుతోందా.. ఆ స్థానాల్లో టీడీపీనే గెలుస్తోందా?

Rayalaseema: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజాగళం అని పేరిట యాత్రను ప్రారంభించిన సంగతి మనకు తెలిసిందే. నిన్న పలమనేరులో ప్రారంభమైనటువంటి ఈ కార్యక్రమం ఎంతో విజయవంతం అయింది ఇకపోతే ఈ కార్యక్రమంలో భాగంగా నేడు ఉమ్మడి అనంతపురం జిల్లాలో చంద్రబాబు నాయుడు పర్యటించారు ఉదయం రాప్తాడులో పర్యటించినటువంటి ఈయన అక్కడ సభను నిర్వహించారు

ఇక మధ్యాహ్నం రెండు గంటల వరకు అనంతపురం సింగనమల నియోజకవర్గం లోని బుక్కరాయసముద్రం మండలంలో మరో సభను కూడా ఏర్పాటు చేశారు. ఇక సాయంత్రం ఐదున్నరకు కదిరిలో మరో భారీ బహిరంగ సభను చంద్రబాబు నాయుడు నిర్వహించబోతున్నారు అయితే ఈ కార్యక్రమాలలో భాగంగా చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత చేసే అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజలకు వివరిస్తున్నారు.

తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలను చేయబోతున్నారు అనే విషయాలను తెలియ చేయడమే కాకుండా ఈ ప్రభుత్వం పట్ల తీవ్రస్థాయిలో విమర్శలు కూడా చేస్తున్నారు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి భారీ స్థాయిలో మద్దతు లభిస్తుంది.

ఈ క్రమంలోనే చంద్రబాబు నాయుడు రాయలసీమలోకి అడుగుపెట్టడంతో రాయలసీమలో కూడా సీన్ మారిపోయింది అని తెలుస్తుంది ఇప్పటివరకు వైసీపీకి అనుకూలంగా ఉన్నటువంటి సీమ ప్రాంతంలో మెల్లమెల్లగా ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీ వైపే ముగ్గు చూపుతున్నారని స్పష్టంగా అర్థమవుతుంది. ఇక చంద్రబాబు నాయుడు ఇప్పటికే నిర్వహించినటువంటి రా కదలిరా శంఖారావం వంటి కార్యక్రమాలన్నీ కూడా ఎంతో విజయవంతమైన సంగతి తెలిసిందే.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -