Chandrababu: నాలుగంచెల వ్యూహంతో చంద్రబాబు ముందడుగులు.. అలా పోల్ మేనేజ్మెంట్ చేయబోతున్నారా?

Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు రాజకీయాల్లోకి ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండానే వచ్చారు. కాంగ్రెస్‌లో విద్యార్థి నాయకుడిగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించి చివరికి ఒకానొకదశలో దేశరాజకీయాల్లో కీలకంగా వ్యవహరించారు. చంద్రబాబు ఒకసారి ప్రతిపక్షంలో ఉండొచ్చు. మరోసారి అధికారపక్షంలో ఉండొచ్చు. కానీ, ఆయన ప్రభావం మాత్రం ఉంటుంది. తెలుగుదేశం పార్టీ ఎన్నో ఆటు పోట్లు ఎదుర్కొంది. కానీ, దెబ్బతగిలిన ప్రతీసారీ అంతేవేగంగా లేచినిలబడింది. దానికి ప్రధాన కారణం చంద్రబాబుకి ఓపిక ఎక్కువ. చివరి వరకూ ఓటమిని చంద్రబాబు అంగీకరించరు. అంతేకాదు.. పరిస్థితులు ఎంత అనుకూలంగా ఉన్నా.. గెలుపును కూడా చంద్రబాబు అంగీకరించరు. రిజల్ట్ వచ్చే వరకూ అంతే ఓపికగా పని చేస్తారు. అందుకే రాజకీయాలకు అతీతంగా చాలా మంది చంద్రబాబు కష్టజీవి అని అంటారు. గత ఎన్నికల్లో పోలింగ్ రోజున కూడా ప్రజలపై ప్రభావం పడేలా వ్యూహాత్మంగా మాట్లాడారు. ఓటు వేసి వచ్చిన తర్వాత ఎన్నికల కోడ్ ఉల్లంఘన చేయకుండానే ఓటర్లను ప్రభావితం చేసేలా మాట్లాడారు. ఈవీఎంలు ట్యాంపరింగ్ జరుగుతుంది. ఎవరికి ఓటు వేసినా.. వైసీపీకి పడేలా ఈవీఎంలు ట్యాంపరింగ్ చేశారని అన్నారు. దీంతో.. చంద్రబాబు సింపతీని కొట్టే ప్రయత్నం చేశారు. అయితే, గత ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయింది. అంటే చంద్రబాబు చివరి క్షణం వరకూ పోరాటం చేస్తూనే ఉంటారని చెప్పడానికి ఇదో ఉదాహరణ.

ఇప్పుడు కూడా చంద్రబాబు చాలా ఓపికగా, వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. వైసీపీపై నాలుగంచెల వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. మొదటి దశలో బీజేపీతో పొత్తు. ఈ పొత్తు కుదరకుండా ఉండటానికి వైసీపీ తీవ్రంగా ప్రయత్నించింది. చంద్రబాబును కలవడానికి బీజేపీ పెద్దలు నిరాకరించారని ప్రచారం చేశారు. రాష్ట్ర బీజేపీ నేతలు వ్యతిరేకిస్తున్నారని చెప్పుకొచ్చారు. కానీ, చంద్రబాబు పొత్తు కుదిరే వరకూ ఎక్కడా మాట్లాడలేదు. 2 సార్లు ఢిల్లీ వెళ్లి వచ్చిన తర్వాత కూడా మౌనమే చంద్రబాబు సమాధానం అయింది. సీట్ల పంపకాల రూపంలో ఫలితం కనిపించింది. ఇలా మొదటి దశను చంద్రబాబు సక్సెస్ ఫుల్ గా దాటేశారు.

ఇక, ఎన్నికల సమయంలో వైసీపీ నేతల దాడులు, అరాచకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడం రెండో దశ. ఏదో ఒక ప్రాంతంలో దాడులు జరిగితే.. ఆ విషయం రాష్ట్రవ్యాప్తంగా తెలిసేలా ప్రచారం చేస్తారు. దానికి సోషల్ మీడియాను వ్యూహత్మకంగా వాడుకుంటారు. దీనితో ఎగువ మధ్యతరగతి, యువ ఓటర్లను ఆకర్షించవచ్చు.

ఇక, మూడో దశలో చంద్రబాబు సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకొని వెళ్లాలి. చంద్రబాబు ఐదు నెలల క్రితం సూపర్ 6 పేరుతో ఓ మినీ మ్యానిఫెస్టోను విడుదల చేశారు. దాన్ని ప్రజల్లోకి తీసుకొని వెళ్లాలి. వైసీపీ పథకాల కంటే.. టీడీపీ ఎక్కువ పథకాలను ప్రకటించిందని జనానికి తెలియజేయాలి. అయితే, ఇక్కడ ఓ ప్రమాదం కూడా ఉందని కొందరు భావిస్తున్నారు. వైసీపీ అమలు చేసిన మితి మీరిన సంక్షేమం వలనే ఏపీ అభివృద్ధి కుంటుపడిందని.. ఇప్పుడు చంద్రబాబు అంతకుమించి సంక్షేమం అమలు చేస్తే రాష్ట్రం పరిస్థితి ఏంటీ అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. దానికి కూడా టీడీపీ శ్రేణుల దగ్గర ఓ సమాధానం ఉంది. అభివృద్ధి అంశంలో చంద్రబాబుకి ఓ విజన్ ఉందని అంటున్నారు. హైదరాబాద్, అమరావతి విషయంలో అది రుజువు అయిందని చెబుతున్నారు. ఓ ప్లాన్ ప్రకారం అభివృద్ధి చేస్తే సంక్షేమం పెద్ద విషయం కాదని అంటున్నారు.

ఇక చివరి దశలో అధికారులను వైసీపీకి అనుకూలంగా లేకుండా చేయడం. గత ఎన్నికల్లో వైసీపీకి చాలా మంది అధికారులు సహకరించారు. అప్పుడు బీజేపీ.. టీడీపీతో లేదు కనుక అది సాధ్యం అయింది. కానీ, ఇప్పుడు బీజేపీ, టీడీపీ పొత్తులో ఉన్నాయి కనుక.. చంద్రబాబు కేంద్రంపై ఒత్తిడి తీసుకొని వచ్చి వైసీపీకి అనుకూలంగా ఉన్న అధికారులను మార్చాలని చూస్తున్నారు. ఇలా పోలింగ్ వరకు దశలవారీగా నాలుగంచెల వ్యూహాన్ని అమలు చేస్తూ చంద్రబాబు అడుగులు వేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -