Chandrababu Naidu: నేషనల్ పాలిటిక్స్ పై బాబు ఫోకస్.. అసలు టార్గెట్ పార్లమెంట్ పైనే?

Chandrababu Naidu: జాతీయ రాజకీయాలపై టీడీపీ అధినేత చంద్రబాబు మళ్లీ ఫోకస్ పెట్టారు. జాతీయ రాజకీయాల్లో మళ్లీ చక్రం తిప్పాలని భావిస్తున్నారు. ఎన్డీయేలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నట్లు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఎన్టీయేలో చేరి మళ్లీ యాక్టివ్ కావాలని బాబు ప్లాన్ వేశారు. గత ఎన్నికలకు ముందు ఎన్డీయే నుంచి బయటకి వచ్చి మోదీని ఎదుర్కొనేందుకు దేశంలో కాంగ్రెస్ తో పాటు ప్రతిపక్ష నేతలందరినీ కలుపుకున్నారు. అయినా మోదీని బాబు ఎదుర్కొలేకపోయారు. ఇటు ఏపీలో కూడా పార్టీ అధికారంలోకి రాకపోవడంతో గత ఎన్నికల తర్వాత ఎన్టీయేకు మళ్లీ దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇప్పుడు కాస్త చంద్రబాబును దగ్గర చేసుకునేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. బీహార్ లో నితీష్ కుమార్ కూడా ఎన్టీయేకు దూరం కావడంతో పాటు బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలను ఏకం చేసేందుకు ముందుకొచ్చారు. దీంతో దేశ రాజకీయాల్లో పేరున్న చంద్రబాబును దగ్గర చేసకోవాలని బీజేపీ చూస్తోంది. అందులో భాగంగానే చంద్రబాబుకు హైసెక్యూరిటీ పెంచడం, కీలక అధికారిక కార్యక్రమాలకు బాబును కేంద్ర ప్రభుత్వం ఆహ్వానిస్తోంది. ఈ పరిణామాలను చూస్తే వచ్చే ఎన్నికల లోపు ఎన్డీయేలో టీడీపీ చేరడం ఖాయంగా తెలుస్తోంది.

అయితే జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలంటే అసెంబ్లీ ఎన్నికల్లో గెలవడమే కాకుండా వీలైనన్నీ ఎక్కువ లోక్ సభ స్ధానాలను గెలుచుకోవాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఎక్కువ మంది ఎంపీ సీట్లను గెలుచుకుంటే జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పవచ్చని అనుకున్నారు. అందుకే లోక్ సభ నియోజకవర్గాల్లో ప్రత్యేక ఫోకస్ పెట్టారు. పార్టీ ఎక్కడ బలంగా ఉంది.. ఎక్కడ బలహీనంగా ఉంది. సామాజిక వర్గాల వారీగా అభ్యర్ధిగా ఎవరికి కేటాయించాలి అనేది దానిపై ఇప్పటినుంచే కసరత్తు చేస్తున్నారు.

గెలిచే అభ్యర్దులకు మాత్రం సీట్లను కేటాయించాలనే నిర్ణయానికి చంద్రబాబు వచ్చారు. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్ సభ ఎన్నికలు జరుగుతాయి. దీని వల్ల ఓటర్లు అసెంబ్లీ ఎన్నికల్లో ఒక పార్టీకి ఓటేస్తే.. లోక్ సభ విషయానకొస్తే వస్తే మరొకరికి వేస్తున్నారు. దీని వల్ల పార్టీలకు నష్టం జరుగుతుంది. ఇక టీడీపీకి గత ఎన్నికల్లో 45 శాతం ఓటింగ్ వచ్చినా 23 సీట్లు మాత్రమే వచ్చాయి. ముగ్గురు టీడీపీ ఎంపీలు మాత్రమే గెలుపొందారు. దీంతో అసెంబ్లీ, లోక్ సభ రెండూ టీడీపీకి పడేలా ప్రణాళికలు చంద్రబాబు రూపొందిస్తున్నాయి.

అందుకే అభ్యర్ధుల విషయంలో సమతూకం పాటించాలని చంద్రబాబు భావిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఒక పార్టీకి.. లోక్ సభ ఎన్నికల్లో మరో పార్టీకి ఓటు వేయడం వల్ల క్రాస్ ఓటింగ్ జరుగుతోంది. దీని వల్ల పార్టీకి నష్టం జరుగుతుంది. అందువల్ల లోక్ సభ సీటు, అసెంబ్లీ సీట్ల విషయంలో సామాజికవర్గాల ప్రాధాన్యతను పరిగణలోకి తీసుకోనున్నారని ఆ పార్టీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. వీలైనన్నీ ఎక్కువ పార్లమెంట్ సీట్లు గెలుచుకుని జాతీయ రాజకీయాల్లో మళ్లీ చక్రం తిప్పాలని చంద్రబాబు భావిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -