Apple iPhone SE 2: బంపర్‌ ఆఫర్‌: 5జీ ఐఫోన్‌ ధర తెలిస్తే ఎగిరి గంతెస్తారు!

Apple iPhone SE 2: ప్రస్తుతం మార్కెట్లలో రోజుకొక లేటెస్ట్‌ వర్షన్‌ ఫోన్లు వస్తున్నాయి. దేశంలోని వివిధ కంపెనీలు రకరకాల లేటెస్ట్‌ ఫ్యూచర్లను పెట్టి ఫోన్లను విడుదల చేస్తున్నారు. ఇక పండుగలు సమీపిస్తున్నాయంటే చెప్పనక్కర్లేదు మామూలు రోజుల కన్నా భారీగా ధరలు తగ్గించి అమ్ముతారు. దసరా సమీపిస్తున్న నేపథ్యంలో ఫ్లిప్‌కార్డు బిగ్‌ బిలియన్‌ డేస్‌ సేల్‌ ఐఫోన్‌ ఎస్‌ఈ–2పై మంచి ఆఫర్‌ తీసుకొచ్చింది. దీని ధరకు భారీగా తగ్గించడంతో పాటు ఈకామర్స్‌ వెబ్‌సైట్స్‌ స్మార్ట్‌ ఫోన్లపై ఎక్సే్చంజ్‌తో పాటు బ్యాంక్‌ ఆఫర్లను కూడా అందుబాటులో ఉంచింది. ప్రస్తుతం ఐఫోన్‌ ఎస్‌ఈ–2 కేవలం రూ. 13,0908 మాత్రమే.

ఐఫోన్‌ ఎస్‌ఈ– 2 యొక్క 64జీబీ వేరియంట్‌ వాస్తవానికి ఫ్లిప్‌కార్ట్డ్‌లో రూ.39,900 ఉండగా, బిగ్‌ బిలియన్‌ డేస్‌ సేల్‌లో భాగంగా ఫ్లిప్‌ కార్ట్‌ ధరను కేవలం రూ.29,990కు తగ్గించింది. ఫోన్‌ రూ. 9,910 తగ్గింపుతో అందుబాటులో ఉంది.ఫ్లిప్‌కార్ట్‌ అందిస్తున్న అనేక ఆఫర్ల ఇతర ప్రయోజనం పొందడం ద్వారా ఐఫోన్‌ ఎస్‌ఈ–2 ధరను మరింత తగ్గించే అవకాశం ఉంది. అంతేకాక ఐఫోన్‌ ఎస్‌ఈ–2 ఫ్లిప్‌కార్ట్‌లో ఎక్సేంచ్‌ ఆఫర్‌ ద్వారా కూడా అందుబాటులో ఉంది. మీ దగ్గర ఉన్న పాత స్మార్ట్‌ఫోన్‌తో వ్యాపారం చేస్తే రూ. 16,900 వరకు తగ్గింపు పొందవచ్చు. అయితే.. అంత కంటే ముందు మీ పిన్‌ కోడ్‌ని ఎంటర్‌చేసి మీ స్థానంలో ఎక్సే్ఛంజ్‌ ఆఫర్‌ ఉందో లేదో అని చెక్‌ చేసుకోవాలి.

అలాగే ఎక్సే్ఛంజ్‌ డిస్కౌంట్‌ మీరు ఎక్సే్చంజ్‌ చేస్తున్న స్మార్ట్‌ఫోన్‌ మోడల్‌ మరియు స్థితిపై ఆధారపడి ఉంటుంది. ఈ రెండు ఆఫర్లను కలపడం ద్వారా, ఐఫోన్‌ ఎస్‌ఈ–2 ధర 13,090కే వస్తోంది. ఆఫర్లు స్మార్ట్‌ఫోన్‌ యొక్క ఇతర వేరియంట్లపై కూడా చెల్లుబాటు అవుతాయి. అదే ఆఫర్లను వర్తింపజేసిన తర్వాత, ఐఫోన్‌ ఎస్‌ఈ–2 యొక్క 128జీబీ వేరియంట్‌ కేవలం రూ. 18,090 ఉండగా 256జీబీ ధర కేవలం రూ.28,090 మాత్రమే. అంతేకాక బ్యాంక్‌ ఆఫర్లనూ కూడా అందుబాటులో ఉంచింది. ఐసీఐసీఐ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్లు ఈఎంఐ, ఈఎంఐ యేతర లావాదేవీలపై రూ. 1250 తగ్గింపును పొందవచ్చు. ఐసీఐసీఐ బ్యాంక్‌ డెబిట్‌ కార్డ్‌ హోల్డర్లు రూ. 1000 తగ్గింపు పొందవచ్చు.

Related Articles

- Advertisement -

ట్రేండింగ్

LIC policy: ఈ ఎల్ఐసీ పాలసీ గురించి తెలుసా.. రూ.కోటి పొందే అవకాశం!

LIC policy: లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వేర్వేరు వర్గాల కస్టమర్ల కోసం పలు రకాల పాలసీలను అందిస్తోంది. కస్టమర్ల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఎప్పటికప్పుడు వేర్వేరు ఎల్ఐసీ పాలసీలను ప్రకటిస్తూ...
- Advertisement -