Small Children: చిన్న పిల్లల ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టాలా.. అక్కడ ఫ్రీ వైద్యంతో?

Small Children: సాధారణంగా ఎంతో మంది చిన్నారులు పుట్టుకతోనే ఎన్నో రకాల సమస్యలతో లోపాలతో జన్మిస్తూ ఉంటారు ఇలా వివిధ రకాల లోపాలతో జన్మించే వారిలో వినికిడి లోపం సమస్య కూడా ఒకటి.చిన్నపిల్లలు పుట్టుకతోనే వినికిడి లోపంతో పుడుతూ ఉంటారు. అయితే దీనిని చిన్నతనంలోనే పసిగట్టినప్పుడు ఆ సమస్యకు పరిష్కారాన్ని కనుక్కోవడం చాలా తేలిక అవుతుంది అయితే చాలామంది చికిత్స చేయించడానికి డబ్బులు లేక పిల్లల పట్ల చాలా నిర్లక్ష్యం వహిస్తూ ఉంటారు.

ఇలా కేవలం ఆర్థిక సమస్యల కారణంగానే అంత ఖరీదైన వైద్యం చేయించలేకే పిల్లలు జీవితాంతం ఆ సమస్యతో బాధపడేలా చేస్తుంటారు.ఇలా పిల్లలు కనక చిన్నతనంలోనే వినికిడి లోపం సమస్యతో బాధపడుతున్నట్లయితే అలాంటి వారికి ఒక రూపాయి ఖర్చు లేకుండా ఫ్రీగా చికిత్స అందిస్తూ వారిని ఈ సమస్య నుంచి బయటకు తీసుకురావచ్చు అది ఎలాగ అంటే తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర ఇనిస్టిట్యూట్ ఆధ్వర్యంలో శ్రవణం అనే ఆర్గనైజేషన్ ద్వారా పిల్లలకు ఉచితంగా వినికిడి సమస్యకు వైద్యం అందిస్తున్నారు.

 

ఇలా శ్రవణం ద్వారా ముందుగా పిల్లలకు వినికిడి సమస్య ఏ స్థాయి వరకు ఉందో పరీక్షలు నిర్వహిస్తారు. ఈ పరీక్షల ఆధారంగా పిల్లలకు ఇయరింగ్ ఎయిడ్ ప్రొవైడ్ చేసి వారికి చికిత్సను ప్రారంభిస్తారు. ఇది చార్జబుల్ బ్యాటరీ సహాయంతో పని చేస్తుంది. అనంతరం ఇలాంటి చిన్నారులను అదే పాఠశాలలో వారిని చేర్చుకొని మూడు సంవత్సరాల పాటు వారికి శిక్షణ ఇస్తారు.

 

ఇలా మూడు సంవత్సరాల పాటు శిక్షణ ద్వారా స్పీచ్ తెరపి ద్వారా వారికి చెవుడు మూగ వంటి సమస్యలు ఉన్నా కూడా ఆ సమస్యల నుంచి బయటపడేలా శిక్షణ ఇస్తున్నారు ఇలా శ్రవణం ద్వారా ఇప్పటికే ఎంతోమంది చిన్నారులు మూగ, చెవిటి వంటి సమస్యల నుంచి కోలుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. అయితే ఈ విషయం తెలియక చాలా మంది తల్లిదండ్రులు వారి పిల్లలకు పట్ల నిర్లక్ష్యంగా వహిస్తున్నారు. అయితే తిరుపతిలోని శ్రవణం ద్వారా మీ చిన్నారులలో కనుక చెవిటి మూగ సమస్య ఉంటే ఇక్కడ పూర్తి వైద్యాన్ని ఉచితంగా పొందవచ్చు.

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -