Child Trafficking: ఏపీలో పిల్లల అక్రమ రవాణా ఈ స్థాయిలో జరుగుతోందా.. ఏం జరిగిందంటే?

Child Trafficking: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మన రాష్ట్రాన్ని ఎక్కడికో తీసుకెళ్తున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి. నిజంగానే ఆయన మన రాష్ట్రాన్ని ఇతర రాష్ట్రాల కన్నా ముందంజలో నిలబెడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ టాప్ త్రీ పొజిషన్లో నిలబడటం గమనార్హం. ఆంధ్రప్రదేశ్ మూడవ స్థానంలో ఉన్నది అభివృద్ధి విషయంలో మాత్రం కాదండోయ్ పిల్లల అక్రమ రవాణాలో ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో ఉంది.

పిల్లల అక్రమ రవాణాలో భాగంగా మొదటి రెండు స్థానాలలో తొలి రెండు స్థానాల్లో బీహార్, ఉత్తర్ ప్రదేశ్ ఉన్నాయి. ఇవి రెండు జనాభాలోనే చాలా పెద్ద రాష్ట్రాలు. ‘భారత్ చిన్నారుల అక్రమ రవాణా’ పేరుతో గేమ్స్ 24X7 అనే స్వచ్ఛంద సంస్థ, నోబెల్ శాంతి పురస్కార గ్రహీత కైలాశ్ సత్యార్ధి స్థాపించిన కేఎస్సీఎఫ్ సహకారంతో అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా తాజా నివేదికను విడుదల చేయగా ఈ నివేదికలో భాగంగా ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో నిలిచింది.

 

2016వ సంవత్సరం నుంచి 2022వ సంవత్సరం వరకు ఈ నివేదికను విడుదల చేశారు. ఈ ఆరు సంవత్సరాల కాలంలో 21 రాష్ట్రాలలో మూడో స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉండడం గమనార్హం. బీహార్లు ఈ ఆరేళ్ల కాలంలో 4245 కేసులు నమోదు అయ్యాయి. అదేవిధంగా యూపీలో 3836 కేసులు నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్లో 734 కేసులకు నమోదు కాగా.. వాటిలో గుంటూరు (208), నెల్లూరు (125), శ్రీకాకుళం (98), కర్నూలు (74), భీమవరం (28) మంది చిన్నారులు అపహరణకు గురయ్యారు.

 

వెల్లడించిన ఈ వివరాలన్నీ కూడా అధికారకంగా నమోదైనవని చెప్పాలి. ఇక అనధికారకంగా ఎంత మంది చిన్నారులు మిస్ అయ్యారో చెప్పడం కష్టం.ఇకపోతే ఏపీలో మహిళల అక్రమ రవాణా కూడా జరుగుతుందంటూ పవన్ కళ్యాణ్ అనుచిత వ్యాఖ్యలు చేయడం సంచలనగా మారింది. అయితే ఇది నిజమేనని కేంద్ర మంత్రి కూడా తెలియజేశారు. ఇలా 30000 మంది మహిళలు మిస్ అవ్వడంతో వారిలో 27 వేల మందిని వెనక్కి రప్పించామంటూ పోలీసులు చెబుతున్నప్పటికీ ఎక్కడ ఆధారాలు మాత్రం లేకపోవడం గమనార్హం.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -