Oscar Award: ఈ ఆస్కార్ విన్నర్ కన్నీటి కష్టాలు తెలిస్తే షాకవ్వాల్సిందే!

Oscar Award: ప్రస్తుతం దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా మారుమోగుతున్న పేరు ఆర్ఆర్ఆర్. తాజాగా జరిగిన ఆస్కార్ అవార్డు కార్యక్రమంలో ఆర్ఆర్ఆర్ లోని నాటు నాటు పాట ఆస్కార్ అవార్డుని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.. దాంతో అభిమానులు సెలబ్రిటీలు చిత్ర బృందానికి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అయితే ఈ పాట ఇంత మంచి సక్సెస్ సాధించడానికి ఎందరో కృషి ఉందని చెప్పవచ్చు. ఈ పాటకు సంగీతాన్ని కీరవాణి అందించగా, చంద్రబోస్ పాటను రాశారు. ఇక ఈ పాటకు హీరోలతో స్టెప్పులు వేయించింది కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ అన్న విషయం తెలిసిందే.

కాగా ఈ పాట కోసం కొరియోగ్రాఫర్ ప్రేమ రక్షిత్ ఎంతో కష్టపడ్డారట. కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కడంతో ఆయన సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నెటిజన్స్ అభిమానులు సెలబ్రిటీలు సైతం కొరియోగ్రాఫర్ కి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కాగా నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డుని అందుకున్న ప్రేమ్ రక్షిత్ ఒకప్పుడు సూసైడ్ చేసుకోవాలని అనుకున్నారట. ప్రేమ్ రక్షిత్ తండ్రి ఒక వజ్రాల వ్యాపారి కాగా 1993లో కొన్ని కారణాల వల్ల ఆస్తులు మొత్తం పోయాయి. అప్పుడు ప్రేమ్ జీవన ఆధారం కోసం డాన్స్ అసిస్టెంట్ గా మారి ఆ సమయంలో ఒక టైలర్ షాపులో పని చేస్తుండేవాడు.

 

ఆ సమయంలో డాన్స్ పై ఉన్న మక్కువతో డాన్స్ మాస్టర్ గా ప్రయత్నాలు చేసినప్పటికీ అవకాశాలను అందుకోలేకపోయారు. అప్పుడు ప్రేమ్ రక్షిత్ ఏం చేయాలో తెలియక సైకిల్ పై చెన్నైకి వెళ్లి మెరినా బీచ్ లో దూకి ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాడట. అప్పుడు తాను చనిపోతే తన కుటుంబానికి డాన్స్ ఫెడరేషన్ వాళ్ళు 50,000 ఇస్తారని అనుకున్నారట. అలాగే తాను తీసుకువచ్చిన పక్కింటి వాళ్ళ సైకిల్ తీసుకొని వెళ్లకపోతే వాళ్లు తన కుటుంబ సభ్యులను వేధిస్తారని భావించి ఆ కుటుంబాన్ని ఇంటి దగ్గర పెట్టి మళ్ళీ వెళ్ళి సూసైడ్ చేసుకోవాలని భావించాడట. అప్పుడు ప్రేమ్ రక్షిత్ ఇంటికి వెళ్ళగా తన తండ్రి సినిమాలో కొరియోగ్రాఫర్ గా అవకాశం వచ్చింది అని చెప్పడంతో ఎగిరి గంతేసి సంతోషం వ్యక్తం చేశాడట.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -