Naresh-Pavitra Lokesh: నరేష్ పవిత్ర లోకేశ్ ఎఫైర్ పై కొడుకు రియాక్షన్ ఇదే.. తప్పు జరిగిందంటూనే?

Naresh-Pavitra Lokesh: నరేష్ తనయుడు నవీన్ విజయ్ కృష్ణ నందిని నర్సింగ్ హోమ్ అనే సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన సంగతి అందరికీ తెలిసిందే. కానీ ఆ సినిమా ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు వెళ్ళిపోయింది కూడా తెలియనంత అట్టర్ ఫ్లాప్ అయింది. అయితే ఈయన ఈమధ్య ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆ ఇంటర్వ్యూలో తన తండ్రి నరేష్ నాలుగవ పెళ్లి గురించి ప్రశ్నించినప్పుడు ఆయన ఈ విధంగా స్పందించారు.

మొదటినుంచి మా ఇంట్లో ఎవరికి ఏది నచ్చితే అది చేయడం అలవాటు. ఎవరిమీద ఆధారపడటం మాకు ఇష్టం ఉండదు. ఆ పరిణామం లోనే చాలా పొరపాట్లు జరిగాయి. అందుకే ఎవరు మా కుటుంబం గురించి ఎన్ని మాటలు మాట్లాడినా నేను పట్టించుకోలేదు. అందరికీ నచ్చేలాగా బ్రతకడం అంటే చాలా కష్టం. మా నాన్న సంతోషంగా ఉండడం మాకు కావాలి. ఆయన ఏం చేయాలో ఆయనకి బాగా తెలుసు.

 

అతను సంతోషంగా ఉంటే చాలు. అలాగే పవిత్ర లోకేష్ గారు కూడా నాకు చాలా కాలం నుంచి తెలుసు. ఆమె చాలా స్ట్రాంగ్ లేడీ. అలాంటి వ్యక్తులు చాలా తక్కువ మంది ఉంటారు. నేను ఏ పని మొదలుపెట్టిన నాకు ఆల్ ద బెస్ట్ చెప్తారు. ఆవిడ చాలా మంచి మనిషి అంటూ చెప్పుకొచ్చాడు నవీన్ కృష్ణ.

 

అయితే హీరోగా తన కెరియర్ ముగిసిపోయినప్పటికీ డైరెక్టర్ గా మంచి పేరు తెచ్చుకోవాలని నవీన్ ఆలోచిస్తున్నట్లు టాలీవుడ్ సమాచారం. ఇక నరేష్, పవిత్రల విషయానికి వస్తే 2018లో విడుదలైన సమ్మోహనం సినిమా సెట్స్ లో వీళ్ళిద్దరూ ప్రేమలో పడ్డారు. 2021 నుండి లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉన్నారు. ఈ జంట మిడిల్ క్లాస్ అబ్బాయి, హ్యాపీ వెడ్డింగ్, అందరూ బాగుండాలి అందులో నేనుండాలి వంటి అనేక ప్రాజెక్టులలో పని చేశారు.

Related Articles

ట్రేండింగ్

KCR-Jagan: జగన్ కోసం కేసీఆర్ తాపత్రయం వెనుక అసలు లెక్కలివే.. ఓడితే మునిగినట్టేనా?

KCR-Jagan: ఆంధ్రప్రదేశ్లో జరగబోయే ఎన్నికల విషయంలో తెలంగాణలో సైతం పెద్ద ఎత్తున హడావిడి ఆసక్తి నెలకొందని చెప్పాలి. ఈ క్రమంలోనే ఏపీ ఎన్నికల గురించి ఇటీవల బిఆర్ఎస్ అధినేత కేసిఆర్ మాట్లాడుతూ చేసిన...
- Advertisement -
- Advertisement -