Jagan: కుప్పంలో చంద్రబాబును ఓడించేలా వైసీపీ సరికొత్త ప్లాన్.. తెలుగు తమ్ముళ్లలో కలవరం

Jagan: ఏపీలో ఎన్నికలకు ఇంకా రెండేళ్లు ఉండగానే రాష్ట్ర రాజకీయాలు కాక పుట్టిస్తున్నాయి. అధికార, ప్రతిపక్షాలు ఇప్పటినుంచే వ్యూహ, ప్రతివ్యూహలు రచించే పనిలో నిమగ్నమయ్యాయి. దీంతో  ఏపీలో ఇప్పుటినుంచే ఎన్నికల మూడ్ కనిపిస్తోంది. అధికార, ప్రతిపక్షాల మధ్య విమర్శలు, ప్రతివిమర్శలు, ఆరోపణలు, ప్రత్యారోపణలతో రాష్ట్ర రాజకీయాలు హీట్ పుట్టిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం ఏపీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్  ఇప్పటినుంచే ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ప్రశాంత్ కిషోర్ టీంను వచ్చే ఎన్నికల కోసం మరోసారి నియమించుకుని గెలుపు వ్యూహలు సిద్ధం చేస్తున్నారు.

నియోజకవర్గాల వారీగా నేతలతో భేటీలు నిర్వహిస్తున్న జగన్.. వచ్చే ఎన్నికల్లో 175కు 175 సీట్లు గెలుపే దిశగా పని చేయాలని సూచిస్తున్నారు. సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, నవరత్న పథకాల అమలును ప్రజలకు చెప్పాలని సూచించారు.  నియోజకవర్గాల సమావేశాల్లో భాగంగా తొలుత  మాజీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నియోజకవర్గమైన కుప్పంతో సీఎం జగన్ స్టార్ట్  చేశారు.

కుప్పం నియోజకవర్గానికి చెందిన నేతలతో సమావేశమైన జగన్.. పులివెందుల ఎలాగో కుప్పం కూడా తన సొంత నియోజకవర్గమని వ్యాఖ్యానించారు. 175 సీట్ల గెలుపు లక్ష్యంలో భాగంగా కుప్పందే తొలి విజయం కావాలని సూచించారు. వచ్చే ఎన్నికల్లో కుప్పంలో భరత్ ను గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తానంటూ హామీ కూడా ఇచ్చారు జగన్. కుప్పం కోసం రూ.65 కోట్లు మంజూరు చేస్తున్నానని, రెండు రోజుల్లో జీవో వస్తుందన్నారు. కుప్పంలో ఎలాంటి సమస్యలు ఉన్నా తన దగ్గరకు తీసుకొస్తే పరిష్కరిస్తానని చెప్పారు.

కుప్పం టీడీపీకి కంచుకోట అని అంటారని , అది నిజం కాదని సీఎం జగన్ అన్నారు. టీడీపీ,  చంద్రబాబు అలా ప్రజల్లో భ్రమ కల్పించారన్నారు. కుప్పం నియోజకవర్గంలో బీసీలు ఎక్కువమంది ఉన్నారని, ఆ సామాజికవర్గానికి ప్రభుత్వం మంచి పనులు చేస్తోందన్నారు. చంద్రబాబు హయాంలో కంటే ఈ మూడేళ్లలో కుప్పంలో చాలా సమస్యలు పరిష్కరించామని జగన్ స్పష్టం చేశారు.

జగన్ మాటలను బట్టి వస్తే వచ్చే ఎన్నికల్లో కుప్పంలో ఎలాగైనా చంద్రబాబును ఓడించాలనే లక్ష్యంతో వైసీపీ ఉన్నట్లు అర్థమవుతుంది. గతంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లోనూ కుప్పంలో వైసీపీ తమ జెండా ఎగురవేసి చంద్రబాబుకు షాకిచ్చింది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుప్పంపై ప్రత్యేక ఫోకస్ పెట్టి జగన్ సూచనలతో వైసీపీ గెలిచేలా చేశారు. ఇప్పుడు ఏకంగా వచ్చే ఎన్నికల్లో కుప్పంలో చెక్ పెట్టి చంద్రబాబు ఆత్మస్థైర్యం దెబ్బతీయాలని వైసీపీ ప్రణాళికలు రచిస్తోంది. పశ్చిమబెంగాల్ లో మమతా బెనర్జీపై, తెలంగాణలో సీఎం కేసీఆర్ పై బీజేపీ అనుసరిస్తున్న వ్యూహన్నే ఏపీలో చంద్రబాబుపై అమలు చేయాలని జగన్ భావిస్తున్నారు.

పశ్చిమబెంగాల్ లో మమతా బెనర్జీపై సువేందు అధికారిని పోటీలోకి దింపి ఆమెను బీజేపీ ఓడించింది. ఇక తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో గజ్వేల్ లో సీఎం కేసీఆర్ కు పోటీగా మాజీ మంత్రి, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ను బీజేపీ బరిలోకి దింపనుంది. ఇలా అధినేతలనే టార్గెట్ చేస్తే ప్రత్యర్థి పార్టీని, పార్టీలోని ఇతర నేతలను వీక్ చేయవచ్చనేది పార్టీల వ్యూహం. పశ్చిమబెంగాల్ ఇదే అస్త్రాన్ని బీజేపీ విజయవంతంగా ప్రయోగించింది.

ఇప్పుడు చంద్రబాబును ఓడించేందుకు జగన్ కూడా అదే అస్త్రాన్ని అందుకున్నారు. కానీ చంద్రబాబును ఓడించడం అంటే అంత సులువైన విషయం కాదు. చంద్రబాబు అక్కడ నుంచి ఎన్నోసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అంతేకాకుండా సొంత నియోజకవర్గం కూడా. అలాంటి చోట చంద్రబాబును ఓడించడం కష్టమేనని చెప్పవచ్చు. మరి జగన్ అస్త్రం పని చేస్తుందా? కుప్పంలో చంద్రబాబును ఓడిస్తారా? అనేది కాలమే తేల్చాలి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -