CM YS Jagan : బాలయ్యను ఎమోషనల్‌గా టచ్ చేసిన జగన్?

CM YS Jagan :  ప్రతిపక్ష టీడీపీ అంతే సీఎం వైఎస్ జగన్ కు అసలు పడడు. సమయం దొరికినప్పుడల్లా చంద్రబాబు, టీడీపీ నేతలపై ఎప్పుడూ విమర్శలు చేస్తూ ఉంటారు. అసెంబ్లీలో, బహిరంగ సభల్లో గత టీడీపీ ప్రభుత్వం వైఫల్యాలను ఇప్పటికీ ఎండగడుతున్నారు. గత టీడీపీ ప్రభుత్వం చేపట్టలేని సంక్షేమ పథకాలు, అభివృద్ది కార్యక్రమాలు వైసీపీ ప్రభుత్వంలో చేపడుతున్నట్లు జగన్ చెబుతూ ఉంటారు. టీడీపీపై విమర్శలు చేసే జగన్.. నందమూరి నటసింహం, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణపై మాత్రం ఎప్పుడూ విమర్శలు చేయరు. టీడీపీ ఎమ్మెల్యేలందరితో బాలయ్య మంచోడు అంటూ గతంలో ప్రతిపక్షంలో ఉన్న సమయంలో జగన్ వ్యాఖ్యానించడం బట్టి చూస్తే బాలయ్య అంటే జగన్ కు ఎంత ప్రేమ అనేది తెలుసుకోవచ్చు. బాలయ్య విషయంలో రాజకీయంగా, సినిమాల పరంగా కూడా జగన్ ఎప్పుడూ సానుకూలంగానే వ్యవహరిస్తారు. టీడీపీ కంచుకోటలుగా ఉన్న నియోజకవర్గాల్లో వచ్చే ఎన్నికల్లో గెలిచేందుకు జగన్ ఇప్పటినుంచే ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

అందులో భాగంగానే టీడీపీ అధినేత చంద్రబాబు సొంత నియోజకవర్గమైన కుప్పం, ఇక టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గత ఎన్నికల్లో పోటీ చేసిన, వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనున్న గుంటూరు జిల్లాలో మంగళగిరి నియోజకవర్గంపై జగన్ కన్నేశారు. మంగళగిరిలో ఇటీవల టీడీపీ కీలక నేత గంజి చిరంజీవిని వైసీపీలో చేర్చుకున్నారు. ఇక కుప్పంలో గెలుపొందేందుకు వైసీపీ శ్రేణుల్ని జగన్ సమాయత్తం చేశారు. అయితే టీడీపీ కంచుకోటగా ఉన్న హిందూపురం నియోజకవర్గంలో మాత్రం జగన్ ఫోకస్ పెట్టలేదు. చంద్రబాబు బావమరిది అయిన బాలయ్య నియోజకవర్గంపై జగన్ దృష్టి పెట్టకపోవడంతో బాలయ్య పట్ల సాఫ్ట్ కార్నర్ తో జగన్ ఉన్నారని వైసీపీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

ఇక అఖండ సినిమా కూడా టికెట్ రేట్లను పెంచుకునేందుకు, షోలను పెంచుకునేందుకు జగన్ సర్కార్ అవకాశం కల్పించింది. బాలయ్య కూడా టికెట్ రేట్ల తగ్గింపు అంశంపై జగన్ ను గట్టిగా ప్రశ్నించిన సందర్భాలు లేవు. జగన్ బాలయ్య అభిమాని అని, గతంలో కడప బాలయ్య ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పనిచేశారని చెబుతూ ఉంటారు. అందుకే బాలయ్య అంటే జగన్ కు ఇప్పటికీ ఇష్టమని అంటూ ఉంటారు.

అయితే తాజాగా అసెంబ్లీలో జగన్ ఆసక్తికర విషయం బయటపెట్టారు. వైద్య రంగంలో నాడు-నేడుపై జరిగిన చర్చలో బసవతారకం హాస్పిటల్ పేరును జగన్ ప్రస్తావించారు. టీడీపీ ప్రభుత్వం ఉన్న సమయంలో ఆరోగ్య శ్రీ బకాయిలు టైమ్ కి చెల్లించేవారు కాదని, ఇప్పుడు ఆరోగ్య శ్రీ బకాయిలను నెట్ వర్క్ హాస్పిటళ్లకు వెంటనే చెల్లిస్తున్నామని జగన్ స్పష్టం చేశారు. బాలయ్య ఛైర్మన్ గా ఉన్న హైదరాబాద్ లోని బసవతారకం హాస్పిటల్ కు కూడా ఆరోగ్య శ్రీ డబ్బులు వెంటనే ఇస్తున్నామన్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యే అయినప్పటికీ ఎలాంటి బేధం చూపించకుండా బాలయ్య ఛైర్మన్ గా ఉన్న హాస్పిటల్ కి వెంటనే అందిస్తున్నామని చెప్పారు. ఆరోగ్య శ్రీ బకాయిలను వెంటనే చెల్లిస్తున్నందుకు బసవతారకం హాస్పిటల్ వైద్యులు తమ ప్రభుత్వాన్ని అభినందించినట్లు జగన్ బయటపెట్టారు.

చంద్రబాబు ప్రభుత్వంలో బిల్లులు పెడితే ఆలస్యంగా చెల్లించేవారని, కానీ జగన్ ప్రభుత్వంలో బిల్లులు పెట్టిన వెంటనే చెల్లిస్తున్నారంటూ బసవతారకం ఆస్పత్రి వైద్యులు మాట్లాడుకుంటున్నట్లు తన దృష్టికి వచ్చినట్లు జగన్ చెప్పారు. బాలయ్య బావ చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు బసవతారకం ఆస్పత్రికి ఆలస్యంగా బకాయిలు ఇచ్చేవారనే విషయాన్ని జగన్ ఫోకస్ చేయడం ఆసక్తికరంగా మారింది. దీంతో బాలయ్యను ఎమోషనల్ గాజగన్ టచ్ చేశారనే చర్చ జరుగుతోంది. బాలయ్య పట్ల జగన్ సాఫ్ట్ కార్నర్ తో ఉన్నారనే విషయం దీనిని బట్టి మరోసారి తెలుస్తుందని ఏపీ రాజకీయాల్లో చర్చ జరుగుతోంది.

Related Articles

ట్రేండింగ్

AP Recruitments: ఎలాంటి రాతపరీక్ష లేకుండా రూ.50,000 వేతనంతో జాబ్.. ఎలా దరఖాస్తు చేయాలంటే?

AP Recruitments:  నిరుద్యోగులకు శుభవార్త, ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఏపీ ప్రభుత్వం జాబ్ నోటిఫికేషన్ ని తీసుకువచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆరోగ్య వైద్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ జిల్లా...
- Advertisement -
- Advertisement -