Congress Presidential Elections: హీట్ పెంచేస్తున్న కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఎన్నిక.. ఇది మూడోసారి

Congress Presidential Elections: కాంగ్రెస్ జాతీయ అధ్యక్ష పదవిని ఎవరు స్వీకరిస్తారనేది ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దేశంలో కాంగ్రెస్ పార్టీ క్లిష్ట పరిస్ధితుల్లో ఉన్న నేపథ్యంలో బ్యాక్ బోన్ గా ఉండి కాంగ్రెస్ ను నడిపించే నేత ఎవరనేది శ్రేణులను అయోమయానికి గురి చేస్తోంది. నడిపించే నాయకుడు లేకపోవడంతో కాంగ్రెస్ మరింత బలహీననడిపోతుంది. మరో రెండు సంవత్సరాల్లో ఎన్నికలు రానున్న క్రమంలో కాంగ్రెస్ సారధిగా ఎవరికి పగ్గాలు అప్పగిస్తారనేది ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ జాతీయ అధ్యక్ష పదవిని వదులుకోవడానికి గాంధీ కుటుంబం సిద్దమవడంతో.. ఈ సారి గాంధీయేతర కుటుంబానికి చెందిన నేత కాంగ్రెస్ జాతీయ అధ్యక్ష బాధ్యతలను చేపట్టే అవకాశమం వచ్చింది.

ఈ క్రమంలో అధ్యక్ష పదవి రేసులో పలువురి నేతల పేర్లు వినిపిస్తున్నాయి. ఇప్పటికే పలువురి పేర్లు వినిపించగా.. తాజాగా మరో సీనియర్ నేత పేరు ప్రముఖంగా మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ పేరును కాంగ్రెస్ అధినాయకత్వం పరిశీలించగా.. బాధ్యతను తీసుకునేందుకు ఆయన వెనకడుగు వేశారు. అశోక్ గోహ్లాట్ అసక్తి చూపకపోవడంతో.. ఇప్పుడు సీనియర్ నేత శశిథరూర్ ముందుకొచ్చారు. జీ23 నేతగా శశిథరూర్ ఉన్నారు. ఆయన పోటీ చేసే అవకాశముందని, ఇంకా దీనిపై తుది నిర్ణయం తీసుకోలేదనే టాక్ నడుస్తోంది.

ఆదివారం జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో జాతీయ అధ్యక్ష పదవికి ఎన్నికలపై నిర్ణయం తీసుకున్నారు. సెప్టెంబర్ 22న నోటిఫికేషన్ విడుదల చేయనుండగా.. అక్టోబర్ 17న ఎన్నిక జరపున్నారు. అక్టోబర్ 19న ఫలితాలను వెల్లడించనున్నారు. నామినేషన్లకు సెప్టెంబర్ 24 నుంచి సెప్టెంబర్ 30 వరకు టైమ్ ఇచ్చారు. అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు పలువరు నేతలు పోటీ పడుతున్నారు. శవిథరూర్, మనీశ్ తివారీ, పృథ్వీరాజ్ చౌహన్, శిశిథరూర్ లు పోటీ చేసే యోచనలో ఉన్నారు.

సాధారణంగా పార్టీ అధ్యక్షులను ఎన్నుకోవడానికి ప్రతి పార్టీలు ఎన్నికల ప్రక్రియ ఉండగా.. ప్రతి పార్టీ నేతలు ఏకగ్రీవంగా ఎన్నుకుంటారు. కాంగ్రెస్ పార్టీలో అధ్యక్ష పదవికి కేవలం ఇప్పటివరకు రెండుసార్లు మాత్రమే ఎన్నికలు జరిగాయి. 1997లో శరద్ పవార్, రాజేశ్ పైలట్, సీతారాం కేసరి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో సీతారాం కేసరి గెలుపొందారు. ఇక 2000లో జరిగిన ఎన్నికలో సోనియా గాంధీ, జితేంద్ర ప్రసాద్ పోటీ చేశారు. సోనియాకు 7,448 ఓట్లు రాగా.. జితేంద్ర ప్రసాద్ కు 99 ఓట్లు మాత్ర వచ్చాయి. అయితే చాలా సంత్సరాల తర్వాత ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ అధ్యక్ష పదవిని ఎన్నికలు జరిగే అవకాశముంది.

వయస్సురీత్యా సోనియాగాంధీ బాధ్యతలను నిర్వర్తించలేని పరిస్థితి. ఇక రాహుల్ గాంధీ అధ్యక్ష పగ్గాలను చేపట్టేందుకు అసలు అసక్తి చూపడం లేదు. సీనియర్ నేతలు ఎంత ఒత్తిడి తీసుకొచ్చినా రాహుల్ ససేమిరా అంటున్నారు. ఇక ప్రియాంకగాంధీకి గతంలో యూపీ బాధ్యతలు అవ్వగా.. అక్కడ పార్టీ ఘోర పరాజయాన్ని మూటకట్టుకుంది. దీంతో ఈ సారి గాంధీయేతర వ్యక్తి చేతుల్లోకే కాంగ్రెస్ అధ్యక్ష పదవి వెళ్లనుంది.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -