Congress: కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడిగా ఆయన కన్ఫార్మ్?

Congress: కాంగ్రెస్ జాతీయ అధ్యక్ష ఎన్నికలు హస్తం పార్టీలో కాక రేపుతోన్నాయి. అధ్యక్షుడు ఎవరనే దానిపై జోరుగా చర్చ జరుగుతోంది. అధ్యక్ష పదవికి కాంగ్రెస్ లో భారీగా పోటీ నెలకొంది. సీనియర్ నేతలు పోటీ పడుతుండటంతో ఎవరికి పదవి దక్కుతుందనేది ఉత్కంఠ రేపుతోంది. కాంగ్రెస్ లో అధ్యక్ష పదవికి ఎన్నికలు జరిగి చాలా సంవత్సరాలు అవుతోంది. కాంగ్రెస్ చరిత్రలో కేవలం 3 సార్లు మాత్రమే ఎన్నికలు జరిగాయి. చాలా సంవత్సరాల తర్వాత మళ్లీ ఇప్పుడు ఎన్నికలు జరుగుతండటంతో ఉత్కంఠ రేపుతోరంది. ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు.. ఎవరికి అధ్యక్ష పదవి దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది.

అయితే కాంగ్రెస్ జాతీయ అధ్యక్ష పదవి కోసం రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ తో పాటు తిరువనంతపురం ఎంపీ శశిథరూర్ ఠాకూర్ నామినేషన్లు వేసేందుకు సిద్దమవుతున్నారు. కానీ రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ కే ఎక్కువ అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. సోనియా గాంధీ కూడా ఆయన పట్ల సానుకూలంగా ఉన్నారు. స్వయంగా సోనియాగాంధీనే తాజాగా అశోక్ గెహ్లాట్ ను తన ఇంటికి ఆహ్వానించారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి నామినేషన్ వేయాల్సిందిగా సూచించారు. దీంతో కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఆయన కన్ఫార్మ్ అని చెబుతున్నారు.

గాంధీ కుటుంబానికి వీర విధేయుడగా ఆయనకు ేరుంది. పార్టీలో సీనియర్ నేతగా ఆయన ఉన్నారు. కానీ కాంగ్రస్ అధ్యక్ష పదవి చేపడితే రాజస్థాన్ సీఎం పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. కానీ సీఎం పదవికి రాజీనామా చేసేందుకు అశోక్ గెహ్లాట్ సిద్దంగా లేరు. కానీ జాతీయ అధ్యక్ష పదవి చేపడితే పూర్తిగా పార్టీ బాధ్యతలనే చూసుకోువాల్సి ఉంటుంది. అన్ని రాష్ట్రాలు తిరిగి పార్టీ నేతలను కలవాల్సి ఉంటుంది. సీఎంగా పనిచేస్తూ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉండటం కష్టం. ఒకవేళ అశోక్ గెహ్లాట్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికైతే సీఎం పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది.

ఇదే జరిగితే తన ప్రత్యర్ధి అయిన సచిల్ పైలెట్ కి పదవి దక్కే అవకాశముంటుంది. అది ఇష్టం లేని అశోక్ గెహ్లాట్ రెండు పదవులు చేపడతానని సోనియా గాంధీకి చెప్పారట. కానీ సోనియా అందుకు నిరాకరించినట్లు తెలుస్తోంది. దీంతో అశోక్ గెహ్లాట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది చర్చనీయాంశంగా మారింది.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -