Congress Party: కాంగ్రెస్ కొత్త అధ్యక్ష బాధ్యతలు ఎవరికి? మళ్లీ వాయిదా పడ్డ ఎన్నిక

Congress Party: కాంగ్రెస్ పార్టీకి జాతీయ అధ్యక్షుడు కరువయ్యారు. కాంగ్రెస్ పార్టీని నడిపించే సారథి దొరడం లేదు. జాతీయ అధ్యక్ష పదవిని తీసుకునేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. గాంధీ కుటుంబం మాత్రం ఇతర నేతలకు పదవి కట్టబెట్టాలని చూస్తుండగా.. పార్టీలోని సీనియర్ నేతలెవ్వరూ పగ్గాలు తీసుకునేందుకు ఆసక్తి కనబర్చడం లేదు. గాంధీ కుటుంబం చేతుల్లోనే కాంగ్రెస్ జాతీయ అధ్యక్ష పదవి ఉండాలని సీనియర్ నేతలు చెబుతున్నారు. గాంధీ కుటుంబానికి చెందిన వ్యక్తే అధ్యక్ష బాధ్యతలను కొనసాగిస్తే పార్టీ బలం పుంజుకుంటుందని అభిప్రాయపడుతున్నారు.

సెప్టెంబర్ 21 నాటికి కాంగ్రెస్ జాతీయ అధ్యక్ష పదవిని భర్తీ చేయాల్సి ఉంది. దాని కోసం పార్టీలో ఎన్నికలు జరపాల్సి ఉంది. కానీ అధ్యక్ష పదవి స్వీకరించేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో ఎన్నిక మరోసార వాయిదా పడినట్లు తెలుస్తోంది. అధ్యక్ష పదవి ఎన్నికను మరో నెలపాటు వాయిదా వేసినట్లు సమాచారం. దీపావళి తర్వాత అధ్యక్ష పదవికి ఎన్నికలు జరిపే అవకాశముంది. ఎన్నిక ఎప్పుడు నిర్వహించాలనే దానిపై ఆదివారం జరిగే సీడబ్ల్యూసీ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. అనంతరం అధ్యక్ష పదవి ఎన్నికకు షెడ్యూల్ ను ప్రకటించనున్నారు.

గత లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి బాధ్యత వహిస్తూ రాహుల్ గాంధీ పదవికి రాజీనామా చేశారు. దీంతో సోనియా గాంధీ తాత్కాలిక అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు. కానీ అనారోగ్య కారణాల వల్ల ఆమె బాధ్యతలను మోయలేని పరిస్థితుల్లో ఉన్నారు. దీంతో రాహుల్ గాంధీని తీసుకోవాలని కోరగా.. ఆయన పగ్గాలు తిరిగి చేపట్టేందుకు నిరాకరిస్తున్నారు. సీనియర్ నేతలు కూడా రాహుల్ పై ఒత్తిడి తీసుకువస్తుండగా.. ఆయన ససేమిరా అంటున్నారు. సోనియా గాంధీ, పార్టీ పెద్దలు ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ రాహుల్ అధ్యక్ష పదవి స్వీకరించేందుకు వెనకడుగు వేస్తూనే ఉన్నారు.

దీంతో రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్‌కు బాధ్యతలు అప్పగించాలని సోనియా గాంధీ భావించారు. కానీ పగ్గాలు చేపట్టేందుకు ఆయన కూడా ఆసక్తి చూపడం లేదు. గాంధీ కుటుంబం చేతుల్లోనే అధ్యక్ష బాధ్యతలు ఉండాలని అశోక్ గెహ్లాట్ వాదిస్తున్నారు. ఇక అశోక్ గెహ్లాట్ తో పాటు ముకుల్ వాస్నిక్, వేణుగోపాల్, సెల్జా, మలికార్జున్ ఖర్గే, భూపేష్ బఘేల్ పేర్లు కూడా రేసులో వినిపిస్తున్నాయి. అశోక్ గెహ్లాట్ నిరాకరించడంతో.. మిగతా నేతలకు కూడా ముందుగా రావడం లేదు.

ప్రియాంకగాంధీకి బాధ్యతలు అప్పగించాలని కొంతమంది కోరుతున్నారు. కానీ యూపీ ఇంచార్జ్ గా ఆమెకు గతంలో బాధ్యతలు అప్పగించగా.. అక్కడ కాంగ్రెస్ ఘోర ఓటమి పాలైంది. అప్పటినుంచో ఆమె నాయకత్వంపై నేతలు పెదవి విరుస్తున్నారు. దీంతో కాంగ్రెస్ అధ్యక్ష పదవిని ఎవరు చేపడతారనేది అర్థం కావడం లేదు. ప్రస్తుతం సోనియా, ప్రియాంక, రాహుల్ విదేశీ పర్యటనలో ఉన్నారు. వైద్యపరీక్షల కోసం సోనియా విదేశాలకు వెళ్తుండగా.. ఆమె వెంట ప్రియాంక, రాహుల్ కూడా వెళ్లారు.

దీంతో ఆదివారం జరగనున్న సీడబ్ల్యూసీ సమావేశంలో వర్చువల్ గా పాల్గొననన్నారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. అధ్యక్ష పదవి ఎన్నికలపై చర్చించి ఒక డెసిషన్ కు రానున్నారు.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -