Deepika Padukone: ఆసుపత్రి పాలైన బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొనే.. ఇంతకు ఏం జరిగిందంటే?

Deepika Padukone: సినీప్రియలకు బాలీవుడ్ అందాల భామ దీపిక పదుకొనే గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. బాలీవుడ్ లో ఎన్నో సినిమాల్లో నటించి ప్రస్తుతం అగ్రస్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఈ అమ్మడు అభిమానుల గురించి మనందరికీ తెలిసిందే. తన అందంతో ఎంతో మంది అభిమానులను సొంతం చేస్తుంది. ఈమె మొదటిగా 2006లో ఐశ్వర్య సినిమాతో ప్రేక్షకులకు పరిచయం అయింది.

ఇది కన్నడ సినిమా మొదట దీపిక కన్నడ బ్యూటీ.. కన్నడ ఫిలిం ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఆ తర్వాత పూర్తిగా బాలీవుడ్ కి పరిమితమైంది. దీపికా టాలీవుడ్ లో కూడా ఏ సినిమా చేయలేదు. బాలీవుడ్ లోనే తన కెరీర్ మొత్తం సాగి సాగిస్తుంది. ఇక 2018లో స్టార్ హీరో రన్ వీర్ సింగ్ ను వివాహం చేసుకుంది. ఇక ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన హాట్ అందాలను నెట్టింట్లో ఆరబోస్తుంది.

ప్రస్తుతం కెరీర్ పరంగా ఈ అమ్మడు మూడు పూలు ఆరు కాయలు లా బిజీగా ఉన్నట్లు తెలుస్తుంది. వరుస సినీ ఆఫర్లు తన సొంతం చేసుకుని ఒక రేంజ్ లో దూసుకుపోతుంది. ఇదంతా పక్కన పెడితే దీపికా గురించి సోషల్ మీడియాలో ఒక వార్త జోరుగా సాగుతుంది. దీపికా ముంబై హాస్పిటల్ లో చేరినట్లు తెలుస్తుంది. అంతేకాకుండా ఆ పలు రకాల వైద్య పరీక్షలు కూడా చేయించుకుంటుందట. ప్రస్తుతం తన ఆరోగ్యం బాగానే ఉందని బాలీవుడ్ మీడియా ద్వారా తెలుస్తుంది.

ఇక ప్రస్తుతం దీపికా పదుకొనే రెబల్ స్టార్ ప్రభాస్ ప్రాజెక్టుK సినిమాలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. హైదరాబాదులో ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు కూడా ఆమె గుండె వేగంగా కొట్టుకోవడంతో కామినేని హాస్పిటల్ లో ఆమె చికిత్స చేయించుకుంది. ఇక ఈ అమ్మడు హాస్పిటల్లో చేరిన విషయం తెలిసి తన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఇక తన ఆరోగ్య పరిస్థితి గురించి దీపిక అభిమానులకు ఏ విధంగా తెలుపుతుందో చూడాలి.

Related Articles

ట్రేండింగ్

తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి ప్రధానమైన కారణాలివే.. ఆ తప్పులే ముంచేశాయా?

తెలంగాణ రాష్ట్రంలో మూడోసారి అధికారాన్ని సొంతం చేసుకుంటామని కాన్ఫిడెన్స్ తో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. 2014, 2018 ఎన్నికల్లో విజయం సాధించిన ఈ పార్టీకి 2023 ఫలితాలు మాత్రం...
- Advertisement -
- Advertisement -