Viral: వైరల్ అవుతున్న డిప్యూటీ సీఎం నారాయణమూర్తి సంచలన వ్యాఖ్యలు!

Viral: డిప్యూటీ సీఎం నారాయ‌ణ‌స్వామికి కాస్త నోటి దురుసు ఎక్కువ‌ అన్న విషయం మనందరికి తెలిసిందే. చిత్తూరు జిల్లా జీడీనెల్లూరు నుంచి ప్రాతినిథ్యం వ‌హిస్తున్నారు. వైసీపీకి ఆ నియోజ‌క‌వ‌ర్గం కంచుకోట‌. వైసీపీకి అనుకూల సామాజిక వ‌ర్గం ఓట్లు అత్య‌ధికంగా ఉన్నాయి. దీంతో ఆ నియోజ‌క‌వ‌ర్గంలో నిలిస్తే చాలు గెలుపు దానిక‌దే న‌డుచుకుంటూ వ‌స్తుంది. అలాంటి నియోజ‌క‌వ‌ర్గంలో నోటి శుద్ధి లేక‌పోవ‌డంతో నారాయ‌ణ‌స్వామికి క‌ష్టాలు మొద‌ల‌య్యాయి. మరి ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ఆయన నోరుకు అడ్డు అదుపు లేకుండా పోయిందని చెప్పవచ్చు.

నారాయ‌ణ‌స్వామికి టికెట్ ఇస్తే ఓడిపోతార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. వృద్ధాప్యంలో ఉన్న త‌న‌కు కాకుండా, కూతురికి టికెట్ ఇవ్వాల‌ని ఆయ‌న అడుగుతున్నారు. దాంతో నారాయ‌ణ‌స్వామికి జీడీ నెల్లూరు టికెట్ ఇవ్వ‌డాన్ని పెండింగ్‌లో ఉంచారు. ఈ నేప‌థ్యంలో త‌న కార్య‌క‌ర్త‌ల‌తో స‌మావేశ‌మైన నారాయ‌ణ‌స్వామి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.
త‌న‌కు టికెట్ రాక‌పోతే ఆత్మాభిమానాన్ని చంపుకుని జ్ఞానేంద‌ర్‌రెడ్డితో క‌లిసి ప‌ని చేసే ప్ర‌శ్నే లేద‌న్నారు. కాపాడుకోడానికి త‌న‌కు ఆస్తులు, అంత‌స్తులు లేవ‌ని అన్నారు.

 

అలాగే నేను ఎవ‌రికీ భ‌య‌ప‌డాల్సిన ప‌నిలేదు అంటూ నారాయణస్వామి షాపింగ్ కామెంట్ చేశారు. కాగా తాజాగా నారాయణస్వామి చేసిన వాఖ్యలు వైసీపీలో చ‌ర్చ‌నీయాంశ‌మ‌య్యాయి. నిజానికి నారాయ‌ణ‌స్వామికి టికెట్ ఇవ్వ‌కూడ‌ద‌ని అడ్డుకుంటున్న వ్య‌క్తులు, శ‌క్తులు వేరే ఉన్నాయి. స‌ర్వేల ఆధారంగానే టికెట్ ఇస్తాన‌ని సీఎం జ‌గ‌న్ ప‌దేప‌దే అంటున్నారు. జ్ఞానేంద‌ర్‌రెడ్డి చెబితే జ‌గ‌న్ విని నారాయ‌ణ‌స్వామికి టికెట్ ఇవ్వ‌రా? గెలిచే అవ‌కాశం ఉన్న‌ప్పుడు నారాయ‌ణ‌స్వామిని ఎందుకు పోగొట్టుకుంటారు? అనే ప్ర‌శ్నలు ప్రస్తుతం తలెత్తుతున్నాయి. అలాగే త‌న జిల్లాలో వైసీపీని గుప్పిట్లో పెట్టుకున్న పెద్ద‌ల‌తో పాటు సీఎం జ‌గ‌న్‌పై మాట్లాడే ద‌మ్ము లేక‌, జ్ఞానేంద‌ర్‌రెడ్డిపై నారాయ‌ణ‌స్వామి అక్క‌సు వెళ్ల‌గ‌క్కుతున్నార‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

 

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -