Ram Charan: కారును వెంబడించిన ఫ్యాన్స్ విషయంలో చరణ్ అలా ప్రవర్తించారా?

Ram Charan: సెలబ్రిటీలు ఎవరైనా కనిపిస్తే అభిమానులు చుట్టుముట్టటం, హడావిడి చేస్తూ సెల్ఫీలు దిగడం చేస్తూ ఉంటారు. అలాంటి సమయంలో చాలా ఇబ్బందికి గురవుతూ ఉంటారు సెలబ్రిటీలు. ఆ ఇబ్బంది నుంచి తప్పించుకోవటం కోసం ఫ్యాన్స్ కి దూరంగా పారిపోతూ ఉంటారు చాలామంది సెలబ్రిటీలు. అయితే రామ్ చరణ్ మాత్రం అలా చేయలేదంట. ఇంతకీ ఏం జరిగిందంటే రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న గేమ్ చేంజెస్ సినిమా షూటింగ్ ప్రస్తుతానికి హైదరాబాద్ శివారులోని ఇస్నాపూర్ లో జరుగుతుంది. ఈ నేపథ్యంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆ షూటింగ్లో పాల్గొంటున్నారు.

ఇక షూటింగ్ లో రాంచరణ్ పాల్గొంటున్న విషయం తెలుసుకున్న ఆయన అభిమానులు షూటింగ్ ముగించుకొని వస్తున్న రాంచరణ్ కారుని వెంబడించారు. ఆయనతో పాటు ప్రయాణిస్తూ కొంత దూరం వెంబడించిన నేపథ్యంలో రాంచరణ్ కారుని స్లో చేయించి వారందరికీ అభివాదం చేసి దయచేసి జాగ్రత్తగా వెళ్లండి అని అభిమానులని కోరారంట. తాము వెళుతుంటే మరింత స్పీడ్ పెంచి రామ్ చరణ్ కారుని ముందుకి తీసుకువెళ్లిపోతారేమో అనుకున్నారు అభిమానులు.

 

కానీ కారు స్లో చేయించి తమను పలకరించడంతో అభిమానులు షాక్ అయ్యారు. ఇక గేమ్ చేంజర్ సినిమా విషయానికి వస్తే నిజానికి ఈ సినిమా ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా రిలీజ్ చేయాలని నిర్మాత దిల్ రాజు భావించారు అయితే డైరెక్టర్ శంకర్ మధ్యలో ఇండియన్ టు షూటింగు చేయాల్సి రావటంతో గేమ్ చేంజర్ వాయిదా పడుతూ వచ్చింది.

 

సెప్టెంబర్ నెలలో ఈ సినిమాని విడుదల చేయాలని డెడ్ లైన్ పెట్టుకొని మరి యూనిట్ కష్టపడుతుంది. ఈ సినిమాలో రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు తెలుస్తుంది. ఒక పాత్రకు అంజలీని హీరోయిన్ గా మరొక పాత్రకి కియారా అద్వానీ హీరోయిన్ అనే విషయం అందరికీ తెలిసిందే. కాగా ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేయబోతున్నారు దిల్ రాజు.

Related Articles

ట్రేండింగ్

RTO Padmavati: ఏపీ రాజకీయాలలో హాట్ టాపిక్ అవుతున్న ఆర్డోవీ పద్మావతి.. వైసీపీ కోసం ఇంత చేస్తున్నారా?

RTO Padmavati:ఎన్టీఆర్ కృష్ణ జిల్లాలలో ప్రధాన పార్టీ అభ్యర్థుల నామినేషన్ పరిశీలన ప్రక్రియ తీవ్రస్థాయిలో ఉత్కంఠత నెలకొంది. ముఖ్యంగా గుడివాడ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి కొడాలి నాని నామినేషన్ విషయంలో తీవ్రస్థాయిలో...
- Advertisement -
- Advertisement -