Namrata Shirodkar: మహేష్ భార్య నమ్రత ఇన్ని కష్టాలు అనుభవించారా?

Namrata Shirodkar: టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్ లో మహేష్ బాబు, నమ్రతలు నిలుస్తారు. వీరి మధ్య గొడవలు జరిగినట్లు ఎప్పుడూ వార్తలు వినపడలేదు. వీరికి పెళ్లై 17 ఏళ్లు అవుతున్నా ఎంతో అన్యోన్యంగా ఉంటున్నారు. వీరి జోడి గురించి ఇతరులు కూడా విమర్శలు చేయరు. ఎందుకంటే వీరు విమర్శలు చేసే అవకాశం ఎవ్వరికీ ఇవ్వరు కాబట్టి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో నమ్రత తన సంసార జీవితం గురించి పలు విషయాలు వెల్లడించారు.

నమ్రత మాట్లాడుతూ..భార్యభర్తలకు ఒకరిపై మరొకరికి నమ్మకం ఉండాలని, అలా ఉంటేనే వివాహ బంధం సజావుగా సాగుతుందని తెలిపారు. మహేష్ తో వివాహం అయ్యి 17 సంవత్సరాలు అవుతోందని, పెళ్లికి ముందు తామిద్దరము మంచి స్నేహితులమని అన్నారు. అయితే పెళ్లి తర్వాత అన్ని విషయాలను ఒకరికొకరు పంచుకునే వాళ్లమని నమ్రత తెలిపారు. తమ ఇద్దరి మధ్య అనుమానాలకు, రహస్యాలకు, అపార్థాలకు చోటు లేదని, భార్యభర్తలకు ఉండాల్సింది ఇదేనని అన్నారు.

మహేష్ బయటకు వెళ్తే పదిసార్లు ఫోన్ చేసి తాను విసిగించనని నమ్రత తెలిపారు. మహేష్ కూడా తన విషయంలో ఇదే విధంగా వ్యవహరిస్తాడని, అందుకే మహేష్ అంటే తనకు ఎంతో ఇష్టమని తెలిపారు. గౌతమ్ సితార పుట్టిన తర్వాత తమ జీవితం ఎంతగానో మారిపోయిందని తెలిపారు.

 

గౌతమ్ కు హార్ట్ బీట్ సరిగ్గా లేదని వైద్యులు చెప్పడంతో చాలా టెన్షన్ పడ్డామని, జీవితంలో అలా ఎప్పుడూ తాను టెన్షన్ పడలేదని తెలిపారు. గౌతమ్ పుట్టిన టైంలో బరువు కేజిన్నర మాత్రమే ఉండేవాడని అది తనకు ఎంతో బాధను కలిగించదని తెలిపింది. ప్రతిరోజూ గౌతమ్ 10 గ్రాముల బరువు పెరగాలని వైద్యులు తెలిపారని, అందుకే రోజూ గౌతమ్ బరువు పెరగాలని ఆ దేవుడ్ని కోరుకునేదాన్ని అని తెలిపింది. ఒక తల్లిగా ఆ సమయంలో తాను ఎంతో బాధను అనుభవించానని, తన బిడ్డ సంతోషంగా ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలని కోరుకున్నానని తెలిపింది. ప్రస్తుతం నమ్రత మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Related Articles

- Advertisement -

Trending News

- Advertisement -

Latest Posts