Naga Chaitanya: నాగచైతన్య అనుష్క ప్రేమించుకున్నారా.. నిజమేంటంటే?

Naga Chaitanya: సినిమా ఇండస్ట్రీలో ముద్దుగుమ్మలకు కెరీర్ స్కోప్ చాలా తక్కువ అని తరచుగా వింటుంటాం. కానీ ఇది పాత మాట. ఇప్పుడు రోజులు మారాయి. ముద్దుగుమ్మలు కూడా హీరోలతో పాటుగా లాంగ్ కెరీర్ ని సాగిస్తున్నారు. దశాబ్దానికి పైగా ఇండస్ట్రీలో ఉన్నవారు కూడా ఉన్నారు. అడపా దడపా సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు ముద్దుగుమ్మలు. అలాంటి హీరోయిన్ ల ప్రస్తావన వస్తే మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది దేవసేన అనుష్క గురించి.

 

అయితే ప్రస్తుతం అనుష్క జోరు అంతగా లేదనే చెప్పాలి. ఎందుకంటే ఆమె వెండితెర మీద మెరిసి చాలా కాలమే అయ్యింది. మిగతా సీనియర్ హీరోయిన్ లు ఎడా పెడా సినిమాలు చేస్తుంటే అనుష్క మాత్రం ఈ విషయంలో వెనకబడింది. ఈ ముద్దుగుమ్మకు బాహుబలి లాంటి హిట్ రాలేదు మళ్ళీ. ప్రస్తుతం అనుష్క చేతిలో ఒక్క చిత్రం మాత్రమే ఉంది. కుర్ర హీరో న‌వీన్ పోలిశెట్టి తో నటిస్తుంది ఈ కన్నడ కస్తూరి.

 

నాగచైతన్య అనుష్క మధ్యలో అలా జరిగిందా..
సినిమా ఇండస్ట్రీ అన్న తరువాత తారల మీద వార్తలు,వదంతులు సహజమే. అనుష్క విషయంలో కూడా ఇలాంటి వార్త అప్పట్లో సంచలనం అయ్యింది. నాగార్జున పెద్ద కుమారుడు నాగ చైతన్య,అనుష్క ప్రేమలో ఉన్నారని,త్వరలో పెళ్ళి కూడా చేసుకోబోతున్నారు అని వార్తలు వచ్చాయి.

 

ఒక ప్రముఖ న్యూస్ ఛానల్ కూడా దీని మీద వార్తలు ప్రచురించింది. అనుష్క,నాగ చైతన్య మధ్య ఉన్న వయసు వ్యత్యాసం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ న్యూస్ ఛానల్ వీరి పెళ్ళికి పెద్దల సమ్మతం కూడా ఉందని చెప్పింది. విషయం నాగార్జున దాకా వెళ్ళింది. అసలు ఇలాంటి గాలి వార్తల్ని ఎవరు చదువుతారు అని నాగార్జున అగ్గి మీద గుగ్గిలం అయ్యారు. మళ్ళీ చాలా సంవత్సరాల తరువాత అనుష్క ప్రభాస్ మధ్య ఏదో ఉందంటూ వార్తలు వచ్చాయి. ఇప్పటికీ అలాంటి వార్తలు వస్తూనే ఉంటాయి.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కు పోటీ అదే పేర్లతో ఉన్న ఇద్దరు పోటీ.. వైసీపీ కుట్ర చేస్తోందా?

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల త్వరలోనే జరగబోతున్నటువంటి నేపథ్యంలో ఎన్నికల హడావిడి నెలకొంది. ఈ క్రమంలోనే ఎన్నికలకు నామినేషన్ ప్రక్రియ కూడా పూర్తి అయింది. అయితే ఎన్నికలు సమీపిస్తున్నటువంటి తరుణంలో ఒక్కో...
- Advertisement -
- Advertisement -