Niharika: భర్తతో విడాకులపై నిహారిక అలా చెప్పకనే చెప్పేశారా?

Niharika: తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగా కుటుంబానికి ఎలాంటి క్రేజ్ ఉందో మనకు తెలిసిందే.ఇలా మెగా కుటుంబం నుంచి ఎంతోమంది హీరోలు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పటికీ హీరోయిన్ గా మాత్రం నిహారిక ఇండస్ట్రీలోకి వచ్చారు.అయితే ఈమె హీరోయిన్ గా సక్సెస్ కాకపోవడంతో తన కుటుంబ సభ్యులు తనకు జొన్నలగడ్డ వెంకట చైతన్య అనే వ్యక్తితో వివాహం చేశారు.కొంతకాలం పాటు వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్న నిహారిక ప్రస్తుతం తన జీవితంలో ఒడిదుడుకులు ఏర్పడినట్లు తెలుస్తోంది.

 

నిహారిక తన భర్తకు విడాకులు ఇవ్వబోతుందనే వార్తలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ వార్తలకు అనుగుణంగానే వీరిద్దరూ ఇన్స్టాగ్రామ్ లో ఒకరినొకరు బ్లాక్ చేసుకోవడం, అలాగే వెంకట్ చైతన్య తన ఇంస్టాగ్రామ్ లో తన పెళ్లి ఫోటోలు అన్నింటిని కూడా డిలీట్ చేయడంతో వీరిద్దరు విడాకులకు సిద్ధమయ్యారని వార్తలకు మరింత బలం చేకూరింది. అయితే ఇలా వీరి విడాకుల గురించి పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నప్పటికీ ఇటు నిహారిక ఫ్యామిలీ లేదా చైతన్య ఫ్యామిలీ ఎవరు కూడా ఈ విషయంపై స్పందించలేదు.

అయితే తాజాగా భర్తతో విడాకుల గురించి వస్తున్నటువంటి వార్తలపై నిహారిక చెప్పకనే సమాధానం చెప్పేశారు.సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే నిహారిక తరచూ తనుకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటారు. ఈ క్రమంలోనే లంగా వోణీలో ఉన్నటువంటి లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇక ఈ ఫోటోలకు పెద్దగా క్యాప్షన్ కూడా ఇవ్వలేదు కేవలం ఒకే ఒక్క ఫోటోకి ఓల్డ్ లుక్ అంటూ క్యాప్షన్ జోడించారు.

 

ఇక ఇంస్టాగ్రామ్ లో ఫోటోలలో నిహారిక ఒక్కతే ఉన్నటువంటి ఫోటోలను ఉంచారు పెళ్లి ఫోటోలలో కూడా ఈమె చైతన్యతో కలిసి ఉన్నటువంటి ఫోటోలను డిలీట్ చేశారు. ఇలా తన సింగిల్ ఫోటోలను మాత్రమే సోషల్ మీడియాలో ఉంచుకొని వెంకటచైతన్యతో కలిసి ఉన్న ఫోటోలను డిలీట్ చేయడంతోనే ఈమె విడాకుల గురించి క్లారిటీ ఇచ్చారని తన భర్తతో విడాకులు తీసుకొని విడిపోతున్నాను అంటూ ఈ విధంగా నిహారిక చెప్పకనే చెప్పేశారు అంటూ నేటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.మరి ఈ వార్తలపై ఇప్పటికైనా మెగా ఫ్యామిలీ స్పందిస్తుందో లేదో తెలియాల్సి ఉంది.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -