Ramoji Rao: టీడీపీ నష్టపోకూడదని రామోజీరావు ఇంత పెద్ద రిస్క్ చేశారా?

Ramoji Rao: తెలుగుదేశానికి రామోజీరావు కి ఉన్న సంబంధం ఈనాటిది కాదు. ఎన్టీ రామారావు హయాం నుంచి రామోజీరావు కి ఆ పార్టీతో మంచి అనుబంధం ఉంది. అప్పటి ముఖ్యమంత్రి రామారావు హయాంలో తెలుగుదేశం అంతా అభివృద్ధి చెందటంలో రామోజీరావు పాత్ర, ఈనాడు పత్రిక పాత్ర ఉందని చెప్పవచ్చు. అయితే మళ్లీ అలాంటి త్యాగాలే ఇప్పుడు రామోజీరావు చేస్తున్నట్లుగా తెలుస్తుంది.

టీడీపీ ఓడిపోతుందేమో అన్న భయంతో పత్రికా ధర్మాన్ని పక్కనపెట్టి కొన్ని రహస్యాలని దాచిపెడుతుంది. అందుకే కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ కు టీడీపీ మద్దతు ఇస్తుందనే సమాచారం తెలియకూడదని రామోజీరావు భావిస్తున్నట్లు ఉన్నారు. విభజిత ఏపీకి తీవ్ర అన్యాయం చేసిన బిజెపిపై తీవ్ర వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకొని ఆ ప్రభావం తాను ఆరాధించే టీడీపీ పై పడకూడదని రామోజీరావు పరితపిస్తున్నారు. ఢిల్లీ సర్వీసుల బిల్లుపై విపక్షాలు మండిపడుతున్న సంగతి తెలిసిందే. అయినప్పటికీ ఈ బిల్లు లోక్సభలో ఆమోదం పొందడం.

 

తర్వాత రాజ్యసభకు వెళ్లడం అక్కడ కూడా ఆమోదం పొందడం వెంట వెంటనే జరిగిపోయాయి. ఈ బిల్లుకు తెలంగాణ అధికార పార్టీ బీఆర్ఎస్ వ్యతిరేకంగా అలాగే ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే అధికార ప్రతిపక్ష పార్టీలు మద్దతుగా ఓటు వేశాయి. రాజ్యసభలో మొత్తం 238 మంది సభ్యులు ఉన్నారు. వీరిలో 131 మంది అనుకూలంగానూ 102 మంది వ్యతిరేకంగానూ ఓటు వేశారు. మిగిలిన వారు ఓటుకి దూరంగా ఉన్నారు. కానీ ఎన్డీఏ కు టీడీపీ మద్దతు ఇవ్వడాన్ని రామోజీరావు నేతృత్వంలో ఈనాడు పత్రిక దాచిపెట్టడంపై విమర్శలకి దారితీస్తోంది. అయితే దీని గురించి మరో పచ్చ పత్రిక నిజాలను ఇలా రాసుకొచ్చింది.

 

ప్రధాని మోదీ, కేంద్రమంత్రి అమిత్ షా ల మంత్రాంగంతో బీజేపీ తెలుగుదేశం పార్టీల మద్దతును కూడగట్టారని గొప్పగా రాయడాన్ని చూడొచ్చు. ఈ మూడు పార్టీలు బిల్లులు మద్దతుగా ఓటు వేయడంతోనే రాజ్యసభలో కేంద్రం నెగ్గిందని సదరు పచ్చపత్రిక చెప్పుకొచ్చింది. సమాచార హక్కు చట్టంపై పెద్ద ఎత్తున చైతన్య ఉద్యమం చేసిన ఈనాడు సంస్థ తన రాజకీయ ప్రయోజనాల దగ్గరికి వచ్చేటప్పటికీ ఏం రాయటానికి వెనకాడటం లేదు. తను రాసిందే నిజమని నమ్మి వ్యతిరేకత పెంచుకుంటారనే భ్రమలో అధికార పార్టీ ఉందని అనుకుంటున్నట్లున్నారు రామోజీరావు.

Related Articles

ట్రేండింగ్

Jagan Campaigners For TDP: టీడీపీకి జగన్ రెడ్డి స్టార్ క్యాంపెయినర్.. నమ్మకపోయినా వాస్తవం మాత్రం ఇదే!

Jagan Campaigners For TDP: వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ స్టార్ క్యాంపెయినర్ గా మారిపోయారు. ప్రజలు నమ్మిన నమ్మకపోయినా ఇదే వాస్తవమని తెలుస్తోంది చంద్రబాబు నాయుడు సూపర్...
- Advertisement -
- Advertisement -