Naga Chaitanya-Samantha: ఆ కండీషన్లను తట్టుకోలేక సమంత చైతన్యకు విడాకులిచ్చిందా?

Naga Chaitanya-Samantha: టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ కపుల్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి వారిలో నటి సమంత నాగచైతన్య జంట ఒకటి. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనేలా ఈ జంట ఎంతో చూడముచ్చటగా ఉండేది. ఎందరికో ఆదర్శంగా ఉన్నటువంటి నాగచైతన్య సమంత వైవాహిక జీవితం కొన్ని రోజులపాటు సవ్యంగా సాగిన అనంతరం వీరి మధ్య వచ్చిన మనస్పర్ధలు కారణంగా వీరిద్దరూ విడాకులు తీసుకొని విడిపోయారు.

సమంత నాగచైతన్య విడాకులు తీసుకొని రెండు సంవత్సరాలు అవుతున్నప్పటికీ వీరి విడాకులు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. ఇలా సమంత నాగచైతన్య విడాకుల గురించి ఇప్పటికే ఎన్నో వార్తలు వచ్చాయి. అయితే వీరి విడాకులకు గల కారణాలు ఏంటి అనేది మాత్రం క్లారిటీగా తెలియడం లేదు.కస్టడీ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా నాగచైతన్య సోషల్ మీడియాలో వచ్చిన రూమర్స్ కారణంగానే విడాకుల వరకు వెళ్ళామంటూ చెప్పుకోచ్చారు.

 

ఇక నాగచైతన్య సమంత ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నప్పటికీ ఇలా విడాకులు తీసుకొని విడిపోవడంతో ఎంతో మంది అభిమానులు తిరిగి కలిస్తే బాగుంటుందని ఆకాంక్షిస్తున్నారు. అయితే సమంత నాగచైతన్య విడిపోవడానికి సరైన కారణాలు తెలియక పోయినప్పటికీ నాగచైతన్య మాత్రం పెళ్లి తర్వాత సమంతకు భారీగా కండిషన్స్ పెట్టారని గతంలో ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు. ప్రస్తుతం ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

 

పెళ్లి తర్వాత నాగచైతన్య ఎలాంటి కండిషన్స్ పెట్టారు అనే ప్రశ్న గురించి సమంత స్పందిస్తూ పెళ్లయిన తర్వాత నాగచైతన్యలో పెద్దగా మార్పులు రాలేదు కానీ కొన్ని విషయాల్లో మాత్రం చాలా కఠినంగా ఉండే వారని సమంత తెలిపారు.సాయంత్రం 6:00 దాటితే ఇంట్లో సినిమాలకు సంబంధించిన మాటలు ఏ మాత్రం వినపడకూడదని చెప్పారు. అది ఎలాంటి పరిస్థితులలో అయినా కూడా ఆ రూల్ బ్రేక్ చేయకూడదని కండిషన్ పెట్టారు. అంతేకాకుండా పెళ్లికి ముందు నాతో పాటు గంటలు తరబడి షాపింగ్ చేస్తే చైతన్య ఒక్కసారి కూడా నాతో పాటు షాపింగ్ కి రాలేదు అంటూ సమంత చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇలా నాగచైతన్య కండిషన్స్ పెట్టడం వల్లే సమంత తనకు దూరంగా ఉన్నారని తెలుస్తుంది.

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -