Silk Smitha: హీరోయిన్ సిల్క్ స్మిత ఆ స్టార్ హీరోయిన్ ఇంట్లో పని మనిషిగా చేశారా?

Silk Smitha: తన అద్భుతమైన డాన్స్ పెర్ఫార్మెన్స్ తో తన మత్తు కళ్ళతో అందరిని ఎంతగానో ఆకట్టుకున్నటువంటి నటి సిల్క్ స్మిత గురించి చెప్పాల్సిన పని లేదు. ఈమె సినిమాలలో నటిస్తున్నారు అంటే ఈమెను చూడటం కోసమే ప్రేక్షకులు పెద్ద ఎత్తున థియేటర్లకు తరలి వెళ్లేవారు అంటే ఈమెకు ఎలాంటి క్రేజ్ ఉందో అర్థమవుతుంది. ఇలా నటిగా అన్ని భాషలలోనూ ఎన్నోసినిమాలలో నటిస్తూ ఇండస్ట్రీని ఓ ఊపు ఊపినటువంటి సిల్క్ స్మిత ఒకానొక సమయంలో ఒక స్టార్ హీరోయిన్ ఇంట్లో పనిమనిషిగా చేశారు.

 

ఇండస్ట్రీలో స్టార్ గా ఓ వెలుగు వెలిగినటువంటి ఈమె పనిమనిషిగా చేశారు అంటే నమ్మశక్యంగా లేదు.మరి ఈమె ఎవరి ఇంట్లో పని మనిషిగా పని చేశారు అసలు సినిమాలలోకి ఎలా వచ్చారనే విషయానికి వస్తే.. సిల్క్ స్మిత అసలు పేరు వడ్లపట్ల విజయలక్ష్మి. పశ్చిమగోదావరి జిల్లాలోని ఏలూరు సమీపంలోని కొవ్వలి ఆమె స్వగ్రామం. చిన్నప్పటి నుంచి ఈమెకు సినిమాలపై ఎంతో ఆసక్తి ఉండేది అయితే సినిమాల్లోకి ఎలా వెళ్లాలి అన్నది మాత్రం తెలియలేదు.

ఆమెకు పరిచయం ఉన్నవారి ద్వారా ఆమె పశ్చిమగోదావరి జిల్లా నుంచి చెన్నై చేరుకున్నారు. అక్కడికి వచ్చినటువంటి ఈమె జీవనం కోసం కొందరి ఇళ్లల్లో పనిమనిషిగా పాచి పనులు చేసేవారు. ఇలా అప్పట్లో స్టార్ హీరోయిన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి నటి అపర్ణ ఇంట్లో ఈమె పని మనిషిగా చేరారు.ఇలా అపర్ణ ఇంట్లో పనిమనిషిగా చేరడంతో తనకు సినిమాల గురించి సినిమా ఇండస్ట్రీ గురించి కొన్ని విషయాలు తెలిసాయి.

 

ఇక చిన్నప్పటినుంచి డాన్స్ అంటే ఎంతో ఇష్టం ఉన్నటువంటి ఈమె ఎలాగైనా సినిమాలలోకి రావాలని నిర్ణయం తీసుకున్నారు అలా అవకాశాల కోసం ప్రయత్నాలు చేసి ఇండస్ట్రీలో అవకాశాలు పొందారు. ఇక ఈమె పలు సినిమాలలో హీరోయిన్గా నటించారు అనంతరం ఐటెం సాంగ్స్ చేయడంతో ఒక్కసారిగా ఫేమస్ అయ్యారు.ఇలా ఈమెకు ఎంతో మంచి క్రేజ్ రావడంతో అప్పట్లో ప్రతి ఒక్క దర్శకుడు తమ సినిమాలో స్పెషల్ సాంగ్ ఉండేలాగా ఆ సాంగ్లో సిల్క్ స్మిత నటించేలాగే జాగ్రత్తలు తీసుకునేవారు. ఇక ఈమె తన మత్తు కళ్ళతో అందరిని ఆకట్టుకొని పెద్ద ఎత్తున థియేటర్లకు రప్పించేవారు అలా ఇండస్ట్రీలో సిల్క్ స్మిత ఓ వెలుగు వెలిగారని చెప్పాలి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -