Silk Smitha: సిల్క్ స్మిత అప్పుల పాలు కావడానికి ఆ సినిమానే కారణమా?

Silk Smitha: సిల్క్ స్మిత పరిచయం అవసరం లేని పేరు ఒకానొక సమయంలో దక్షిణాది సినిమా ఇండస్ట్రీని తన మత్తు కళ్ళతో ఓ ఊపు ఊపేసిన సిల్క్ స్మిత ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఇలా ప్రతి ఒక్క సినిమాలోని సిల్క్ స్మిత పాట లేనిదే సినిమాలు విడుదల అయ్యేవి కాదు.సిల్క్ స్మిత కోసమే ప్రేక్షకులు కూడా పెద్ద ఎత్తున థియేటర్లకు తరలి వెళ్లేవారు అంటే అప్పట్లో ఈమె క్రేజ్ ఎలా ఉండేదో అర్థం చేసుకోవచ్చు.ఈ విధంగా ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సిల్క్ స్మిత మరణం ఇప్పటికీ ఒక మిస్టరీగానే మారిపోయింది.

ఇండస్ట్రీలో ఎంతో మంచి జీవితం అనుభవించాల్సిన సిల్క్ స్మిత అర్ధాంతరంగా ఆత్మహత్య చేసుకోవడంతో ఒక్కసారిగా చిత్ర పరిశ్రమ మొత్తం షాక్ అయ్యారు. అయితే ఇప్పటికీ సిల్క్ స్మిత మరణించడానికి గల కారణాలు ఏంటి అనే విషయం మాత్రం తెలియడం లేదు.అయితే కొందరు సీనియర్ నటీనటులు పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటూ వారికి తెలిసిన విషయాలను చెబుతూ ఉంటారు. తాజాగా కాకినాడ శ్యామల సైతం ఒక ఇంటర్వ్యూలో పాల్గొని సిల్క్ స్మిత మరణం గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

కాకినాడ శ్యామల నటిగా మాత్రమే కాకుండా నిర్మాతగా ఫైనాన్షియర్ గా కూడా కొనసాగారు. ఈ క్రమంలోనే సిల్క్ స్మిత ఓ సినిమా చేయడం కోసం ఈమె దగ్గర భారీగా డబ్బు తీసుకున్నారని తెలిపారు. అయితే ఆ సినిమాలో సిల్క్ స్మిత నటించిన విధానానికి వ్యక్తిగత జీవితంలో ఆమె ఉండే తీరుకు పూర్తిగా విభిన్నంగా ఉండేదని శ్యామల తెలియజేశారు. అయితే ఈ సినిమా పూర్తిగా నష్టాలను తీసుకువచ్చిందని అయితే ఆమె తిరిగి కోలుకొని తన డబ్బును తనకు తిరిగి చెల్లించారని తెలిపారు.

ఇలా తాను ఫైనాన్షియల్ గా కూడా మంచి సక్సెస్ సాధించిన సమయంలోనే ఆత్మహత్య చేసుకున్నారని ఈ సందర్భంగా కాకినాడ శ్యామల తెలియజేశారు. అయితే ఆమెది హత్యన ఆత్మహత్యనా అనే విషయం ఆ భగవంతుడికే తెలియాలని ఈ సందర్భంగా కాకినాడ శ్యామల సిల్క్ స్మిత మరణం గురించి చేసినటువంటి ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -