Silk Smitha: సిల్క్ స్మిత చివరి ఉత్తరంలో ఉన్న షాకింగ్ విషయాలివే!

Silk Smitha: టాలీవుడ్ సీనియర్ హీరోయిన్, దివంగత సిల్క్ స్మిత పేరు వింటే చాలు సినీ ప్రియుల్లో కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి. తన అందం, అభినయం, నాట్యంతో ఒకతరాన్ని ఒక ఊపు ఊపిన నటిగా స్మితను చెప్పొచ్చు. యావత్ తెలుగు ప్రజలనే కాకుండా తమిళ, మలయాళ, కన్నడ ఆడియెన్స్ ను కూడా తన ప్రతిభతో వశం చేసుకున్నారామె.

ఇండస్ట్రీలతో సంబంధం లేకుండా మొత్తం దక్షిణాది చిత్ర పరిశ్రమను కొన్నేళ్ల పాటు సిల్క్ స్మిత షేక్ చేశారు. అగ్ర హీరోలు కూడా తమ సినిమాల్లో స్మితతో ఒక్క పాట అయినా ఉండేలా ప్లాన్ చేసేవారంటేనే ఆమె క్రేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. అలాంటి ఈ అగ్రతార సూసైడ్ చేసుకుని చనిపోయారు. స్కిల్క్ ఇలా ఎందుకు చేసుకున్నారు, కారణమేంటనేది ఎవరికీ తెలియదు. ప్రాణాలు తీసుకునేంత కష్టం ఆమెకు ఏమొచ్చిందనేది ఇప్పటికీ తెలియరాలేదు. అయితే సిల్క్ స్మిత స్వయంగా చనిపోయే ముందు ఓ లేఖ రాశారు. అందులో ఏముందో తెలుసుకుందాం..

అతడే నన్ను మోసం చేశాడు: సిల్క్ స్మిత
‘దేవుడా నా ఏడో సంవత్సరం నుంచి నేను పొట్టకూటి కోసం ఎంతో కష్టపడ్డా. నేను నమ్మిన వారే నన్ను దారుణంగా మోసం చేశారు. నా అనే వారు నాకెవ్వరూ లేరు. బాబు తప్ప ఎవరు నాపై ఎవరూ ప్రేమ చూపలేదు. బాబు తప్ప అందరూ నా కష్టం, సొమ్ము తిన్నవారే. నాకు మనశ్శాంతి లేకుండా చేశారు. అందరికీ మంచే చేశా. కానీ, నాకు చెడే జరిగింది. నా ఆస్తిలో ఉన్నదంతా బాబు కుటుంబానికి, నా కుటుంబానికి పంచాలి. నా ఆశలన్నీ ఒకరి మీదే పెట్టుకున్నా, అతడు నన్ను మోసం చేశాడు’ అని ఆ లెటర్ లో సిల్క్ రాసుకొచ్చారు.

ఎంత నరకం అనుభవించానో చెప్పలేను
‘దేవుడు ఉంటే వాడ్ని తప్పకుండా చూసుకుంటాడు. ఒకప్పుడు నేను నగలు కొనుక్కుంటే పెట్టుకోనివ్వలేదు. నాకు ఒకడు ఐదేళ్ల కింద జీవితం ఇస్తానన్నాడు. కానీ ఇప్పుడు ఇవ్వడం లేదు. నా రెక్కల కష్టం తినని వాడు లేడు బాబు తప్ప. ఇది రాయడానికి నేను ఎంత నరకం అనుభవించానో మాటల్లో చెప్పలేను’ అంటూ సిల్క్ స్మిత ఎంతో ఆవేదనతో ఆ లేఖను రాశారు.

Related Articles

ట్రేండింగ్

ఏపీలో ఆడుదాం ఆంధ్ర పోటీలకు రిజిస్ట్రేషన్లు ప్రారంభం.. రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలంటే?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ ఎప్పటికప్పుడు సంచలన నిర్ణయాలు తీసుకుంటూ విద్యార్థులు, యువతకు మేలు చేస్తున్న సంగతి తెలిసిందే. జగన్ సర్కార్ ఆడుదాం ఆంధ్ర పేరుతో క్రీడా పోటీలను నిర్వహిస్తుండగా...
- Advertisement -
- Advertisement -