RRR Sequel: ఆర్.ఆర్.ఆర్ మూవీ సీక్వెల్ పై విజయేంద్ర ప్రసాద్ అలా చెప్పారా?

RRR Sequel: ఆర్ ఆర్ ఆర్ ప్రపంచానికి తెలుగు సినిమా సత్తా చూపించిన ఒక అద్భుతం. గ్లోబల్ బాక్సాఫీస్ ఈ సినిమా సృష్టించిన ప్రభంజనం మాటల్లో చెప్పలేనిది. తెలుగువాడికి ఆస్కార్ అవార్డుని సైతం తీసుకువచ్చింది. ఇప్పటికీ తెలుగువారు ఆ అద్భుతమైన క్షణాలని ఎంజాయ్ చేస్తున్నారు. వసూళ్లలో రికార్డ్స్ తిరగరాసిన ఈ సినిమా సీక్వెల్ గురించి ఇప్పటికే చాలా వార్తలు వస్తున్నాయి. తాజాగా రాజమౌళి తండ్రి అయినా రైటర్ విజయేంద్ర ప్రసాద్ దీనికి సంబంధించిన ఒక కొత్త అప్డేట్ ఇచ్చారు.

రామ్ చరణ్ ఎన్టీఆర్ నటించిన ఆర్ ఆర్ ఆర్ సినిమాకు సీక్వెల్ చేయటానికి ప్లాన్ చేస్తున్నామని, ఇది హాలీవుడ్ స్టాండర్డ్స్ లో ఉంటుందని.. ఈ సినిమా రాజా మౌళి లేదా అతడే పర్యవేక్షణలో మరొకరు దర్శకత్వం వహిస్తారు అని విజయేంద్ర ప్రసాద్ తెలిపారు. దీంతో ఆర్ ఆర్ ఆర్ మూవీ పార్ట్ 2 కి దర్శకుడు రాజమౌళి కాదా అంటూ కన్ఫ్యూషన్లో పడుతున్నారు. మళ్లీ విజయేంద్ర ప్రసాద్ అంతటి వారు చెప్పారు కాబట్టి నిజమే అయి ఉంటుంది అంటూ సమాధాన పడుతున్నారు.

 

ఇప్పటికే ఈ సినిమాకి సీక్వెల్ కదా సిద్ధమైందని సమాచారం ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతుందట. అయితే విజయేంద్ర ప్రసాద్ చెప్పినట్లు ఈ సినిమాకి డైరెక్టర్ రాజమౌళి కాకపోతే ఆ సినిమాకి అంతగా హై రాకపోవచ్చు ఎందుకంటే రాజమౌళి తప్ప ఆ సినిమాని అంత గొప్పగా మరొకరు తీస్తారని ఎవరూ ఊహించడం లేదు. అయితే ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబుతో తీయబోయే సినిమా మీద తన దృష్టి పెట్టారట.

 

ఈ సినిమా యాక్షన్ అడ్వెంచర్ నేపథ్యంలో ప్రపంచాన్ని చుట్టివచ్చే సాహసికుడి కథగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా కోసం అమెరికాకు చెందిన క్రియేటివ్ ఆర్ట్స్ ఏజెన్సీ తో రాజమౌళి ఒప్పందం చేసుకున్నారు. దాంతో ఈ సినిమాకు హాలీవుడ్ టెక్నీషియన్స్ పనిచేస్తారని కన్ఫర్మ్ అయింది. బహుశా ఈ సినిమా కంప్లీట్ అయిన తర్వాత రామ్ చరణ్, ఎన్టీఆర్ ల మూవీ ఉండొచ్చు. ఏ విషయమైనా అఫీషియల్ గా రాజమౌళి అనౌన్స్ చేసే వరకు ఈ కన్ఫ్యూజన్ తప్పదు.

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -