Mahesh Babu: వాటిలో మహేష్ బాబు కనిపించే ఛాన్స్ లేదా.. ఇన్ని కఠిన నిబంధనలా?

Mahesh Babu: రాజమౌళితో సినిమా అంటే హీరోలకు నిర్మాతలకు చాలా కష్టతరంగా ఉంటుందనే సంగతి మనకు తెలిసిందే. అయితే సినిమా విడుదలైన తర్వాత సినిమా సృష్టించే సంచలనాలు ముందు ఈ కష్టం మొత్తం మర్చిపోతారు. అంత అద్భుతంగా రాజమౌళి సినిమాలు ఉంటాయనే విషయం అందరికీ తెలిసిందే. తమ కెరియర్లో ఇలాంటి సినిమా ఒక్కటైనా నటించాలన్న ఉద్దేశంతో ఎంతోమంది సెలబ్రిటీలు రాజమౌళితో సినిమా చేయడానికి ఆత్రుత కనబరుస్తూ ఉంటారు.

 

ఒక్కసారి రాజమౌళి సినిమాకు కమిట్ అయ్యాము అంటే ఆ సినిమా పూర్తి అయ్యేవరకు బయటకు రావడానికి వీలు లేకుండా ఉంటుంది. ఇక రాజమౌళి సినిమా అంటే రెండు మూడు సంవత్సరాల పాటు ఆయన ఆధీనంలోనే ఉండాల్సి ఉంటుంది. ఇదివరకు ఆయనతో చేసిన హీరోలు అందరూ కూడా ఇలాగే ఉన్నారు. ఇక ఇప్పుడు రాజమౌళితో సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా చేయబోతున్న సంగతి మనకు తెలిసిందే.

ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా ప్రారంభమవుతున్నాయని తెలుస్తుంది. సినిమా పనుల నిమిత్తం మహేష్ బాబు జర్మనీ కూడా వెళ్లారని సమాచారం. ఇక ఈ సినిమా కోసం కోసం చాలా కండిషన్లకు ఒప్పుకొని ఎన్నో త్యాగాలు చేశారని తెలుస్తుంది. మహేష్ బాబు సినిమాల పరంగా ఏ మాత్రం విరామం దొరికిన ఫ్యామిలీతో కలిసి వెకేషన్ వెళ్ళిపోతారు. ఇకపై అలా వెళ్లడానికి కుదరదని రాజమౌళి చెప్పారట.

 

సినిమా షూటింగ్ మొదలైనప్పటి నుంచి పూర్తి అయ్యేవరకు మహేష్ బాబుకి సంబంధించిన ఒక లుక్ కూడా బయటకు రాకూడదని మహేష్ బాబుకు రాజమౌళి తెలియచేశారు. ఇక మహేష్ బాబు ఎన్నో బ్రాండ్లకు అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ పూర్తి అయ్యేవరకు ఆ యాడ్స్ కూడా చేయకూడదని రాజమౌళి మహేష్ బాబుకు కండిషన్ పెట్టడంతో మహేష్ బాబు కూడా ఈ కండిషన్లకు ఒప్పుకున్నారని తెలుస్తోంది. ఇలా ఈ విషయం గురించి సోషల్ మీడియాలో వార్తలు వైరల్ గా మారడంతో అంటే ఇంకా తమ హీరోని రెండు మూడు సంవత్సరాల పాటు చూడలేమా అంటూ అభిమానులు కంగారు పడుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -