Prashanth Varma: పెద్ద హీరోలతో చేయడానికి వ్యతిరేకం కాదు.. ప్రశాంత్ కామెంట్స్ వైరల్!

Prashanth Varma: టాలీవుడ్ యంగ్ హీరో తేజా సజ్జా హీరోగా నటించిన తాజా చిత్రం హనుమాన్. ఈ మూవీకి ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. చిన్న సినిమాగా విడుదలైన ఈ సినిమా పెద్ద విజయం అందుకుంది. సంక్రాంతి పండుగ కానుకగా విడుదలైన ఈ సినిమా దాదాపుగా 250 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. ఇప్పటికీ కలెక్షన్ల వర్షం కురిపిస్తూ దూసుకుపోతూనే ఉంది. ఇది ఇలా ఉంటే దర్శకుడు ప్రశాంత్ వర్మ ఈ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తూనే వరుసగా ఇంటర్వ్యూలకు హాజరవుతూ ఫుల్ బిజీబిజీగా నడుపుతున్నారు. అందులో భాగంగా తాజాగా ప్రశాంత్ వర్మ ఒక ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ..

 

దర్శకుడు రాజమౌళి అంటే నాకు ఎంతో ఇష్టం. ఆయన టీమ్ లోకి చేరడం కోసం నేను ఎన్నో ప్రయత్నాలు చేశాను. ఆయన మేకింగ్‌ స్టైల్‌ నాకెంతో ఇష్టం. ఆయన వద్ద అసిస్టెంట్‌ డైరెక్టర్‌ గా పనిచేయడం కోసం ఎన్నోసార్లు ప్రయత్నించాను. ఇంజినీరింగ్‌ చదువుతున్నప్పుడే ఛాన్స్‌ కోసం మెయిల్స్‌ కూడా పంపించాను. నా అభ్యర్థనను సున్నితంగా రిజెక్ట్ చేశారు. టీమ్‌లో ఖాళీ లేదని అన్నారు. హార్డ్‌వర్క్‌, టాలెంట్‌ ఉన్నా నన్ను ఎందుకు తీసుకోవడం లేదనే కారణంతో ఆయనపై కోపం కూడా వచ్చింది. అదే సమయంలో ఏకలవ్యుడు గుర్తుకొచ్చారు. రాజమౌళి సినిమాలు, మేకింగ్‌ వీడియోలు చూసి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను అని తెలిపారు ప్రశాంత్ వర్మ.

పెద్ద హీరోలతో పని చేయడానికి వ్యతిరేకం కాదు. వాళ్లతో సినిమా అంటే ఎక్కువ సమయం పడుతుంది. వాళ్ల కోసం ఎదురుచూసి నా సమయాన్ని వృథా చేసుకున్న సందర్భాలున్నాయి. ఆ తర్వాత డెడ్‌లైన్‌ పెట్టుకుని వర్క్ చేస్తున్నాను. . ఒకవేళ టామ్‌ క్రూజ్ వచ్చిన నా వద్ద ఉన్న వాళ్లతోనే సినిమా చేస్తా అని చెప్పుకొచ్చారు దర్శకుడు ప్రశాంత్ వర్మ.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -