Yash: కూతురు పొరపాటు చేస్తే యశ్ అలా ప్రవర్తించారా.. ఏం జరిగిందంటే?

Yash: కే జి ఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోగా మారిపోయారు నటుడు యశ్. బుల్లితెర నటుడిగా పలు సీరియల్స్ లో నటిస్తున్నటువంటి ఈయన సినిమా అవకాశాలను అందుకొని హీరోగా మారిపోయారు. ఇలా పలు సినిమాలలో నటిస్తూ హీరోగా కొనసాగుతున్నటువంటి ఈయన కే జి ఎఫ్ సినిమాలో నటించారు.ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చే సంచలనమైన విజయాలను అందుకుంది దీంతో ఈయన పాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు.

 

ఈ సినిమా తర్వాత ఇప్పటివరకు ఎలాంటి సినిమాలు ప్రకటించలేదు ఇలా ఈయన సినిమాలు లేకపోవడంతో భార్య పిల్లలతో కలిసి పలు వెకేషన్ లోకి వెళ్లడం దైవ దర్శనాలకు వెళ్లడం జరుగుతుంది. ఈ క్రమంలోనే తన సొంత ప్రాంతమైనటువంటి మైసూర్ లోని నెంజన్‌గుడ్‌ గుడికి వెళ్లి దైవదర్శనం చేసుకున్నారు. ఈ ఆలయానికి యశ్ తన భార్య పిల్లలతో కలిసి హాజరయ్యారు.

ఈ విధంగా ఆలయానికి వెళ్లి గర్భగుడి ముందు కూర్చొని స్వామివారిని దర్శించుకున్నారు. అయితే ఆలయ ప్రధాన అర్చకులు దేవుడికి హారతి ఇచ్చిన తర్వాత హారతి పల్లం వీరి దగ్గరకు తీసుకురావడంతో తన కుమారుడి చేతిలో 500 ఇచ్చి హారతి పళ్లెంలోకి వేసి హారతి తీసుకోమని చెప్పారు. ఇక తన కుమార్తెకు కూడా డబ్బులు హారతి పళ్లెంలోకి వేయాలని చెప్పడంతో ఆమె ఆ డబ్బును ఎడమ చేతితో వేసింది.

 

ఈ విధంగా యశ్ కుమార్తె హారతి పళ్లెంలోకి ఎడమ చేతితో డబ్బును వేయడంతో ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే తన కూతురు అలా వ్యవహరించడంతో హీరో తన కుమార్తెను పిలిచి దేవుడికి ఇచ్చే దక్షిణ అలా ఎడమ చేతితో వేయకూడదని చెప్పి కుడి చేతితో దక్షిణ వేయించారు. ఇందుకు సంబంధించిన ఈ వీడియో వైరల్ గా మారడంతో.. ఎంత పెద్ద స్టార్ అయినా కూతురికి ఒక తండ్రేనని కూతురికి ఇలాంటి మంచి అలవాట్లనే నేర్పాలి అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -