Yash: యష్ గురించి వెలుగులోకి భయంకరమైన నిజం.. ఏమైందంటే?

Yash: తెలుగు ప్రేక్షకులకు కన్నడ హీరో యష్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కేజిఎఫ్ 1 తో టాలీవుడ్ ప్రేక్షకులను ఓ రేంజ్ లో ఫిదా చేశాడు. ఈ సినిమాతో వారిని అభిమానులుగా మార్చుకున్నాడు. కాకుండా బాలీవుడ్ ప్రేక్షకులను కూడా అభిమానులుగా మార్చుకున్నాడు ఈ కన్నడ హీరో. ఇక ఆ మధ్యనే కేజిఎఫ్ 2 కూడా విడుదల కాగా ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకుంది.

 

ఈ సినిమాతో ఈయన పాన్ ఇండియా లెవెల్ లో పేరు సంపాదించుకున్నాడు. ఇక అంత మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈయన గురించి ఒక వార్త బాగా వైరల్ అవుతుంది. అదేంటంటే యష్ దుర్మార్గుడని.. ఒక హీరోయిన్ వేధించాడు అని తెలిసింది. అయితే అసలు విషయం ఏంటంటే.. కే జి ఎఫ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసుకున్న ముద్దుగుమ్మ శ్రీనిధి శెట్టి. కేజీఎఫ్ 2 లో ఈమె నటనకు మంచి మార్కులు కూడా వచ్చాయి.

ఇదంతా పక్కన పెడితే ఈమె సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా కనిపిస్తూ ఉంటుంది. ఇక ఈమెపై నెగటివ్ కామెంట్లు వచ్చిన వెంటనే స్పందిస్తూ ఉంటుంది. అయితే బాలీవుడ్ క్రిటిక్ ఉమైర్ సంధు హీరో యష్ గురించి ఒక ట్వీట్ చేశాడు. అది కూడా శ్రీనిధి ఫోటో పెట్టి ఆమె చెప్పుకొచ్చినట్లు విధంగా ఇలా రాశాడు. కే జి ఎఫ్ సెట్ లో యష్ నన్ను వేధించాడు. అతనితో ఇంకెప్పుడు పని చేయాలనుకోవడం లేదు.

 

అతనితో నటించడం నాకు ఇష్టం లేదు. అతను ఒక టాక్సీక్.. వేధించే మనిషి అంటూ రాసుకోవచ్చాడు. దీంతో వెంటనే శ్రీనిధి ఈ విషయం గురించి స్పందించింది. ఇందులో ఎంత మాత్రం నిజం లేదని.. అందరూ సోషల్ మీడియాను దుర్వినియోగం చేస్తున్నారు అని.. అయినా అలాంటి వారికి కూడా నేను ప్రేమను అందిస్తున్నాను అని తెలిపింది. ఇక ఈ విషయం ఇప్పుడు తెలియజేయడానికి కారణం..

 

ఇలాంటి ప్రమాదకరమైన వార్తలు పూర్తిగా పునరావృతం కాకుండా మరోసారి గట్టిగా చెబుతున్నాను అంటూ.. కే జి ఎఫ్ సినిమాలో నటించిన అదృష్టమని.. రాకింగ్ స్టార్ యష్ తో కలిసి పనిచేయడం గౌరవంగా ఫీల్ అవుతున్నాను అని.. ఆయన ఎంతో ప్రత్యేకమైన వ్యక్తి అని.. స్నేహితుడని.. ఇన్స్పిరేషన్ అని.. రాకింగ్ స్టార్ యష్ నేను మీకు ఎప్పటికీ పెద్ద ఫ్యాన్ నే అని పంచుకుంది. ఇక ఆమె చెప్పిన విషయం బాగా వైరల్ అవ్వగా వెంటనే నెటిజన్స్ ఉమైర్ సంధు పై బాగా ఫైర్ అవుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -