Yash-Sreeleela: వామ్మో.. యష్ అంటే శ్రీలీలకు ఇంత అభిమానమా?

Yash-Sreeleela: టాలీవుడ్ ఇండస్ట్రీలో కేజీఎఫ్ సినిమా క్రియేట్ చేసిన రికార్డులు అన్నీ ఇన్ని కావు. అదొక అద్భుతమనే చెప్పాలి. ఆ సినిమాను ఇండియన్ ఆడియన్స్ అంత సులభంగా మర్చిపోరు కూడా. ఈ సినిమాతో హీరో యష్ ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. అన్ని అంచనాలను మించి ఈ సినిమా రికార్డులను తిరగరాసిందంటే ఈ సినిమా స్థాయి అలాంటిది. ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా అన్ని భాషల్లోనూ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా తర్వాత హీరో యష్‌ పాన్ ఇండియా స్థాయిలోనే సినిమాలు తీసేందుకు చూస్తున్నాడు.

కేజీఎఫ్2 సినిమా తర్వాత పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే తన సినిమాలు ఉండేలా యష్ ప్లాన్ చేస్తున్నాడు. ఈ తరుణంలో హీరో యష్‌కు సంబంధించిన ఓ మ్యాటర్‌ ఇప్పుడు నెట్టింట వైరల్‌ అవుతోంది. కన్నడ హీరోయిన్ అయిన శ్రీలీలకు యష్‌కు మధ్య సంబంధం ఉందని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. శ్రీలీల ఇప్పుడు తెలుగులో పాపులర్‌ హీరోయిన్ గా అవతరించింది. మొన్నే ధమాకా సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.

హీరోయిన్ శ్రీలీలకు హీరో యష్‌ బావ అవుతాడని, వీరిద్దరి మధ్య సంబంధం ఉందంటూ సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది. ఈ క్రమంలోనే శ్రీలీల రియాక్ట్ అయ్యింది. తనకు యష్‌కు మధ్య ఎలాంటి బంధుత్వం లేదని ఆమె మీడియా ముఖంగా తెలిపింది.

యష్ భార్య రాధికకు తన తల్లి స్వయంగా పురుడు పోసిందని, అందుకే తమ ఇద్దరి మధ్య ఏదో బంధుత్వం ఉందని ఈ మధ్య వార్తలు వస్తున్నట్లు శ్రీలీల తెలిపింది. యష్ వల్లే తనకు సినిమా అవకాశాలు కూడా వస్తున్నట్లు లేనిపోనివి రాస్తున్నారని శ్రీలీల ఫైర్ అయ్యింది. కానీ అది నిజం కాదని, తమ మధ్య కేవలం స్నేహ బంధం మాత్రమే ఉందని, తాను యష్ ను బావ అని పిలుస్తానని, రాధికను అక్క అని పిలుస్తానని శ్రీలీల తెలిపింది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -