Narasimha Naidu: నరసింహ నాయుడు మూవీ కథ ఆ ఊరి కథ అని తెలుసా?

Narasimha Naidu: సాధారణంగా పెద్ద హీరోల సినిమాలు సంక్రాంతి రోజు రిలీజ్ చేయటానికి చూస్తారు మూవీ మేకర్స్. ఆరోజున రిలీజ్ అవ్వటం కోసం పోటీపడి మరి మూవీ కంప్లీట్ అయ్యేలాగా చూస్తారు. మేము కూడా ఉన్నాం అంటూ అప్పుడప్పుడు చిన్న సినిమాలు కూడా వాటితో పోటీ పడుతూ ఉంటాయి.

ఏ సినిమా విజయం సాధిస్తుందా అంటూ ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉంటారు. అప్పట్లో సంక్రాంతికి ఎక్కువగా నందమూరి బాలకృష్ణ, మెగాస్టార్ చిరంజీవి సినిమాలు ఎక్కువగా పోటీ పడుతూ ఉండేవి. అలాగే 2001లో కూడా చిరంజీవి సినిమా మృగరాజు పోటీకి వచ్చింది నరసింహనాయుడు.

 

అదే సంవత్సరం దేవీపుత్రుడుగా వెంకటేష్ కూడా పోటీలో దిగాడు. అయితే నరసింహనాయుడు దెబ్బకి అటు మృగరాజు గాని ఇటు దేవి పుత్రుడు గాని అడ్రస్ లేకుండా కొట్టుకుపోయాయి. అంతగా ఘనవిజయాన్ని సాధించింది ఈ సినిమా. ఇంతకీ విషయం ఏమిటంటే ఈ కథ బీహార్ లో రాష్ట్రంలో నిజంగా జరిగిందని చాలామందికి తెలియదు.

 

కధా రచయిత చిన్ని కృష్ణ రాసారని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ నిజానికి ఇది బీహార్ రాష్ట్రంలోని ఒక గ్రామంలో జరిగిన కథ 30 సంవత్సరాల క్రితం బీహార్ లో ఒక గ్రామంలో కొన్ని మూకలు గ్రామం పై దాడి చేయడానికి వెళ్లేవాలంట. వాళ్లని ఎదుర్కోవటం కోసం గ్రామంలో ప్రతి ఇంటి నుంచి ఒక మగపిల్లాడిని అప్పజెప్పి ఒక సైన్యాన్ని నిర్మించుకున్నారు గ్రామస్తులు.

 

అంటే ఇక ఆ పిల్లాడిపై ఆ కుటుంబం ఆశలు వదిలేసుకోవాల్సిందే. ఈ లైన్ అల్లుకొనే చిన్నికృష్ణ కథని అల్లుకొని నరసింహనాయుడు సినిమా కథ రాశారు. దానికి పరుచూరి సోదరులు తుది మెరుగులు పెట్టారు. ఇక సినిమా విడుదలైన తర్వాత ఆ సినిమా సృష్టించిన సునామీ అందరికీ తెలిసిందే. ఈ సినిమా ప్రభావంతో ఐదు ఆరేళ్ల పాటు ఫ్యాక్షని సినిమాలే టాలీవుడ్లో రాజ్యమేలాయి.

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -