Balayya: ఫ్లెక్సీ వివాదంలో బాలయ్య తప్పు లేదా… అనవసరంగా నిందలా?

Balayya: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ అధికారం కోసం ఎంతకైనా దిగజారుతోంది. జూనియర్ ఎన్టీఆర్ పేరును వాడుకుని దిగజారుడు రాజకీయాలు చేస్తూ టీడీపీ ఓట్లను చీల్చే ప్రయత్నం చేస్తోంది. ఫ్లెక్సీ వివాదంలో బాలయ్య తప్పు లేకపోయినా అవకాశవాద రాజకీయాలు చేస్తున్న వైసీపీ బాలయ్యదే తప్పు అనే విధంగా ప్రచారం చేస్తోంది. గోటితో పోయేదానిని గొడ్డలి వరకు తెచ్చేలా నీలి మీడియా కథనాలు ఉన్నాయి.

 

వాస్తవానికి బాలయ్య ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడంపై ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు. ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమానికి సంబంధించిన ఫ్లెక్సీలో స్వాగతం సుస్వాగతం అని ఉండటాన్ని మాత్రమే ఆయన తప్పుబట్టి ఒకే ఒక్క ఫ్లెక్సీని తీయించాలని చెప్పారు. బాలయ్య మనస్సును, ఆయన చెప్పిన మాటలను అర్థం చేసుకోకుండా బాబాయ్, అబ్బాయ్ మధ్య గ్యాప్ ను పెంచాలని వైసీపీ ప్రయత్నిస్తోంది.

 

వాస్తవానికి బాలయ్య నిజంగా అవమానించేలా ప్రవర్తించి ఉంటే జూనియర్ ఎన్టీఆర్ నుంచి రియాక్షన్ వచ్చేది. అయితే ఈ ఘటన విషయంలో ఎన్టీఆర్ సైలెంట్ గా ఉన్నారంటే బాలయ్య తప్పు ఏం లేదని అర్థం చేసుకోవచ్చు. 2024 ఎన్నికలకు మరికొన్ని నెలల సమయం ఉన్న నేపథ్యంలో బాలయ్య సైతం అనవసర వివాదాలకు ప్రాధాన్యత ఇవ్వాలని భావించారు. అయితే టీడీపీ అంటే గిట్టని వారు జూనియర్ ఎన్టీఆర్ ను అవమానించారనేలా కామెంట్లు చేస్తున్నారు.

గతంలో బాలయ్య చాలా సందర్భాల్లో జూనియర్ ఎన్టీఆర్ ను సపోర్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. జూనియర్ ఎన్టీఆర్ సినిమాలకు సంబంధించిన ఈవెంట్లకు హాజరై ఆ సినిమాలను ప్రమోషన్స్ చేసిన సంగతి తెలిసిందే. తండ్రి తర్వాత తండ్రిలా బాలయ్య జూనియర్ ఎన్టీఆర్ విషయంలో ప్రేమగా మెలిగారు. జూనియర్ ఎన్టీఆర్ నటించిన సినిమాలను సైతం బాలయ్య మెచ్చుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి.

 

ప్రతి కుటుంబంలో చిన్నచిన్న సమస్యలు, మనస్పర్ధలు సాధారణం అనే సంగతి తెలిసిందే. అంత మాత్రాన బాలయ్య, జూనియర్ ఎన్టీఆర్ లను బద్ధ శత్రువులుగా క్రియేట్ చేస్తూ పుంఖానుపుంఖాలుగా కథనాలను వండివార్చడం సరికాదు. జూనియర్ ఎన్టీఆర్ తనకు రాజకీయాలపై ఆసక్తి లేదని చాలా సందర్భాల్లో చెప్పారు. ఒకవేళ తారక్ రాజకీయాల్లోకి వస్తానని చెప్పినా ఆయనను ఆపేవాళ్లు ఎవరూ లేరు.

 

దేవర సినిమా షూటింగ్ పనులతో బిజీగా ఉన్న తారక్ రాజకీయాల గురించి ఆలోచించడం లేదు. తారక్ కొన్నిరోజుల క్రితం తన సన్నిహితులతో ఏపీలో టీడీపీ అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పినట్టు తెలుస్తోంది. బాద్ షా సినిమా సమయంలో తారక్ తాను ఎప్పటికీ టీడీపీలోనే ఉంటానని వివరణ ఇచ్చిన సంగతి తెలిసిందే. బాలయ్య జూనియర్ ఎన్టీఆర్ బంధం విడదీయలేని బంధం అని వాస్తవాలు జూనియర్ ఎన్టీఆర్ కు తెలుసని రాజకీయ విశ్లేషకులు సైతం కామెంట్లు చేస్తున్నారు. బాలయ్యపై అనవసరంగా నిందలు వేయడం సరికాదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -