Balayya: బాలయ్యకు పద్మ పురస్కారాలు ఇచ్చే ఉద్దేశం లేదా.. ఏమైందంటే?

Balayya: ఈ సంవత్సరం గణతంత్ర దినోత్సవ సందర్భంగా పద్మ పురస్కారాల లిస్టును విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం. ప్రతి సంవత్సరం, వాళ్ళు ఎంపిక చేసుకున్న రంగంలో రాణించి ఎత్తుకు ఎదిగిన తర్వాత ప్రజలకు సేవ చేసిన వారికి ఈ పద్మ పురస్కారాలను అందిస్తుంది కేంద్ర ప్రభుత్వం. అయితే ఈ సంవత్సరం విడుదలైన పద్మ పురస్కారాలలో 15 మంది తెలుగు వాళ్ళు ఉన్నారు.

 

కానీ సినీ రంగంలో ఒకే ఒక పేరు ఉన్నాది. అదే మెగాస్టార్ చిరంజీవిది. ఇంతకుముందు పద్మభూషణ్ వచ్చిన చిరంజీవికి ఈ సంవత్సరం పద్మ విభూషణ్ రావడంతో మెగా ఫ్యామిలీతో పాటు మెగా ఫ్యాన్స్ అందరూ ప్రపంచవ్యాప్తంగా సంబరాలు చేసుకుంటున్నారు. మెగాస్టార్ సినిమా చరిత్రకి చేసిన సేవ గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు. అయితే ఎంపిక చేసుకున్న రంగంలో రాణించి, ప్రజలకు సేవ చేస్తున్న ప్రతి ఒక్కరికి పద్మ పురస్కారాలు వస్తాయా అంటే రావనే చెప్పాలి.

సినీ రంగంలో మీ హీరోకి అవార్డ్ వచ్చింది మా హీరోకు రాలేదు అనే గొడవలు రానే వస్తాయి. అలాగే నందమూరి బాలకృష్ణ అభిమానులు కూడా ఇప్పుడు మొఖం మాడ్చుకుంటున్నారు. బాలయ్య తన కెరీర్లో లెక్కలేనన్ని అద్భుతమైన సినిమాలులో నటించి కెరీర్ లో ఎత్తుకు వెళ్లారు. బసవతారక క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా ప్రజలకి ఫ్రీ క్యాన్సర్ ట్రీట్మెంట్ కూడా ఇప్పిస్తున్నారు. కానీ బాలయ్య కెరీర్లో ఎన్నో నంది అవార్డులు ఉన్నాయి కానీ ఒక్క పద్మ పురస్కారం, జాతీయ అవార్డు కూడా లేదు.

 

దీనికి కారణం ఏంటి అని సోషల్ మీడియాలో బాలయ్య అభిమానులు అందరూ బాధపడుతుండగా రాజకీయంలోకి రావడమే బాలయ్యకి అవార్డులు రాకుండా చేస్తుందేమో అని అనుమానం వస్తుంది. కేవలం ఆ ఒక్క కారణం వల్ల బాలయ్యకి అన్యాయం జరుగుతుంది అని అభిమానులు నిరాశ చెందుతున్నారు. ఒక నటుడు ఎంత టాలెంటెడ్ అయినా ఎంత గౌరవం ఉన్నా తనకంటూ గొప్ప గొప్ప అవార్డులు ఉంటేనే చరిత్రలో స్థానం దక్కుతుంది. అది బాలయ్యకు లేకపోవడం బాధగా ఉంది అని అభిమానులు నిరాశపడుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

YCP Candidates: వైసీపీ అభ్యర్థులు అంతా పేదవాళ్లేనా.. అయ్యో ఇంత పేదవాళ్లకు టికెట్లు ఇచ్చారా?

YCP Candidates: పాపం.. వైసీపీ నేతలు అందరు పేదవాళ్లే.. ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా.. ఇదే మేము అంటున్న మాట కాదండోయ్ వైసీపీ నేతలు వైసీపీ అధినేత సీఎం జగన్ మోహన్ రెడ్డి చెబుతున్న...
- Advertisement -
- Advertisement -