Lokesh Kanagaraj-Shankar: శంకర్ జక్కన్నతో పోల్చి చూస్తే లోకేశ్ కనగరాజ్ తోపా.. అసలేం జరిగిందంటే?

Lokesh Kanagaraj-Shankar: టాలెంటు ఉంటే ఏ భాషలోనైనా రాణించవచ్చు అని నిరూపించిన సినీ దర్శకులు చాలామంది ఉన్నారు. భాషతో సంబంధం లేకుండా తెలుగులో హిట్ కొట్టిన దర్శకులు చాలామంది ఉన్నారు. మణిరత్నం, బాలచందర్ దగ్గర నుంచి ఈ పరంపర కొనసాగుతూనే ఉంది. అలాగే మన దర్శకులు కూడా పరాయి భాషలలో ఎన్నో హిట్స్ కొట్టారు. అయితే ఒకటి రెండు సినిమాలు హిట్ అయినంత మాత్రాన పెద్ద దర్శకులతో కంపేర్ చేయడం అనేది కరెక్ట్ కాదు.

కానీ ఇప్పుడు లియో విషయంలో అదే జరుగుతుంది. శంకర్ తర్వాత మళ్లీ ఆ స్థాయి సంపాదించుకున్న దర్శకుడిగా లోకేష్ కనకరాజ్ ని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు జనాలు. అంతేకాదు లియో బుకింగ్స్ కూడా తెలుగు నాట ఓ రేంజ్ లో బుక్ అవుతున్నాయి. పెద్ద సినిమాలైనా భగవంత్ కేసరి, టైగర్ నాగేశ్వరరావు కి పోటీగా అదే రోజు విడుదలవుతుందంటే ఆ దర్శకుని గట్స్ కి మెచ్చుకోవాల్సిందే.

అయితే అంత మాత్రం చేత శంకర్ తో పోల్చడం అనేది సరైన పద్ధతి కాదు. ఎందుకంటే శంకర్ స్టైల్ వేరు. శంకర్ ఎప్పుడు సబ్ స్టాండ్స్ మీదే ఆధారపడ్డారు. జెంటిల్మెన్ లో అప్పడాలు అమ్మే వాడిని దొంగగా చూపించి దాని వెనుక విద్యావ్యవస్థలోనే లోపాలను ఎండగట్టారు. అలాగే భారతీయుడులో 70 ఏళ్ల ముసలివాడిని హీరోగా చూపించి లంచం తీసుకున్న కొడుకుని చంపినా కూడా జనాలు ఒప్పుకునేలాగా తీసిన టాలెంటెడ్ డైరెక్టర్ శంకర్.

ఇవన్నీ కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటూనే అంతర్లీనంగా సమాజానికి మెసేజ్ ఇవ్వడం అనేది శంకర్ స్టైల్. అయితే కుర్ర డైరెక్టర్ అయిన లోకేష్ కనకరాజ్ స్టైల్ వేరు. హీరోఇజం ని ఏ విధంగా చూపిస్తే మాస్ ఆడియన్స్ కి గూస్ బంప్స్ వస్తాయో అలాంటి కథలు రాసుకుంటాడు తప్పించి అతని సినిమాలలో సమాజాన్ని ఏదో ఉద్ధరించేద్దాం అనే ఒక కాన్సెప్ట్ కనిపించదు. ఇదే విషయాన్ని అతను ఒప్పుకున్నాడు కూడా. కాబట్టి ఎవరి రూట్లో వాళ్ళు తోపులు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan-KTR: జగన్, కేటీఆర్ నోటివెంట ఉమ్మడి రాజధాని మాట.. కామెంట్ల వెనుక ప్లాన్ ఇదేనా?

CM Jagan-KTR: ఏపీ అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల్లో ఒకవైపు మరోవైపు తెలంగాణ పార్లమెంట్ ఎన్నికలు ఓకే రోజు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున పార్టీ నాయకులు ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు అయితే ఈ...
- Advertisement -
- Advertisement -