Lokesh Kanagaraj: లియో ఫ్లాప్ కావడం వెనుక ఈ తప్పులే కారణమా.. అలా చేసి ఉంటే బ్లాక్ బస్టర్ అయ్యేదా?

Lokesh Kanagaraj: తమిళ స్టార్ దర్శకుడు లోకేష్ కనకరాజ్ గురించి తెలుగు ప్రేక్షకులకు బాగా తెలుసు. ఆయన డైరెక్ట్ చేసిన ఖైదీ సినిమా నుంచి ఆయన తీసిన ప్రతి సినిమా తెలుగులో కూడా ఆదరిస్తూ వచ్చారు. అలాగే లియో సినిమా మీద కూడా చాలా హైప్ ఏర్పడింది తెలుగులో విజయ్ కి ఒక రేంజ్ ఉంది. ఆ రేంజ్ కి మించి తెలుగు వాళ్ళ అభిమానాన్ని సొంతం చేసుకున్న దర్శకుడు లోకేష్ కనకరాజ్. అతని మీద ఉన్న నమ్మకంతోనే లియో సినిమా మీద భారీ అంచనాలు పెట్టుకున్నారు ప్రేక్షకులు.

అందుకే లియో ప్రి బుకింగ్స్ ఒక రేంజ్ లో బుక్ అయ్యాయి. కానీ ఎందుకో అంచనాలని రీచ్ కాలేకపోయాడు లోకేష్. విక్రమ్ సినిమా విజయం తర్వాత దర్శకుడు లోకేష్ కనకరాజ్ కి అభిమానులు ఎక్కువయ్యారు. అతని సినిమాలు ఎప్పుడా అని ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకంటే అతని కథనం, చెప్పే తీరులో ఒక వైవిధ్యం ఉంటుంది. ఇప్పుడు లియో సినిమా కూడా చాలా అంచనాల మధ్య విడుదలైంది.

అయితే ఈ కథ విషయానికి వస్తే కథలో ఏమాత్రం కొత్తదనం ఉండదు. ఇలాంటి కథలు తెలుగులో చాలా వచ్చాయి తర్వాత సెకండ్ హాఫ్ లో ల్యాగ్ చాలా ఎక్కువైంది అని విమర్శలు వచ్చాయి. ఎంతో టాలెంట్ ఉన్న దర్శకుడు ఎక్కడ తప్పటడుగు వేశాడు అని పరిశీలిస్తే అతను చేసిన పెద్ద తప్పు స్క్రిప్ట్. షూటింగ్ విషయంలో హడావుడి పడటం విక్రమ్ రిలీజ్ అయిన కొద్ది రోజులకే సినిమాను మొదలుపెట్టేయటంతో స్క్రిప్ట్ ని సరిగ్గా తీర్చిదిద్దుకోలేకపోయాడు.

దాని ఔట్పుట్ సినిమా మీద పడింది. అందుకే ఈసారి లోకేష్ చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు, ఎందుకంటే అతను తర్వాత తీయబోయేది గ్రేట్ స్టార్ రజనీకాంత్ తో ఈ సినిమా కోసం ఆరు నెలల పాటు పనిచేయనున్నాడట. అలాగే రజనీకాంత్ ఫ్రీ అవ్వడానికి కూడా చాలా టైం పడుతుంది కాబట్టి లోకేష్ కి స్క్రిప్ట్ వర్క్ చేయటానికి ఎక్కువగా సమయం ఉంటుంది. సో ఈసారి అతని నుంచి ఒక బెటర్ సినిమాని ఎక్స్పెక్ట్ చేయవచ్చు.

Related Articles

ట్రేండింగ్

Election Campaigns: ఎన్నికల వేళ గరిష్టంగా రోజుకు 5,000 రూపాయలు.. కూలీలకు పంట పండుతోందా?

Election Campaigns: ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల ప్రచారం చూస్తుంటే ఇవి అత్యంత ఖరీదైనవి గా కనిపిస్తున్నాయి. ఎందుకంటే గతంలో ఎన్నికల సమయంలో పార్టీ నాయకుల మీద అభిమానంతో స్వచ్ఛందంగా జనాలు...
- Advertisement -
- Advertisement -