Game Changer: గేమ్ ఛేంజర్ మూవీకి ఇంత దారుణమైన పరిస్థితా.. అసలేం జరిగిందంటే?

Game Changer: సౌత్ ఇండియా స్టార్ డైరెక్టర్గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి డైరెక్టర్ శంకర్ ప్రస్తుతం రెండు పాన్ ఇండియా సినిమాలకు దర్శకత్వం వహిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఈయన కమల్ హాసన్ హీరోగా నటించిన భారతీయుడు 2 సినిమా షూటింగ్ అర్థంతరంగా ఆగిపోవడంతో శంకర్ రామ్ చరణ్ హీరోగా గేమ్ ఛేంజర్ అని సినిమాకు కమిట్ అయ్యారు.ఈ సమయంలోనే కమల్ హాసన్ నటించిన విక్రమ్ సినిమా అద్భుతమైన విజయం అందుకోవడంతో కోర్టు నుంచి భారతీయుడు సినిమా షూటింగుకు అనుమతి తెచ్చి ఈ సినిమా షూటింగ్ పనులను మొదలుపెట్టారు.

 

ఇక కోర్టు నుంచి అనుమతులు రావడంతో డైరెక్టర్ శంకర్ కూడా చేసేదేమీ లేక చరణ్ సినిమాను పక్కనపెట్టి ప్రస్తుతం కమల్ హాసన్ సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. ఈ విధంగా గేమ్ ఛేంజర్ సినిమా షూటింగ్ వాయిదా పడుతూ రావడంతో ఈ సినిమా అనుకున్న విధంగా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కాబోదని తెలుస్తోంది. అయితే ఈ సినిమా వచ్చే ఏడాది బహుశా విడుదల కాకపోవచ్చు అన్న వార్తల కూడా వినపడుతున్నాయి.

గత కొద్ది రోజుల క్రితం ఉదయం ఇది స్టాలిన్ నటించిన సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నటువంటి కమల్ హాసన్ తాను నటిస్తున్న భారతీయుడు 2 సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 2వ తేదీ విడుదల కాబోతుందని తెలిపారు.అయితే ఈ సినిమా విడుదల విషయంలో క్లారిటీ లేనిదే కమల్ హాసన్ ఈ వ్యాఖ్యలు చేయరు. ఇలా ఏప్రిల్ నెలలో భారతీయుడు 2 సినిమా విడుదల అయితే రామ్ చరణ్ సినిమా వెంటనే విడుదల చేయడానికి శంకర్ ఏమాత్రం ఇష్టపడరు.

 

దీంతో వచ్చే ఏడాది కూడా ఈ సినిమా విడుదల బహుశా ఉండకపోవచ్చు అని అనుమానాలు తలెత్తుతున్నాయి ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ఏ విధమైనటువంటి అప్డేట్ లేకపోవడంతో రామ్ చరణ్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా దర్శక నిర్మాతలను భారీగా టోల్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమా మరింత ఆలస్యంగా విడుదల కాబోతుంది అనే విషయం తెలియడంతో అభిమానుల ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది.

Related Articles

ట్రేండింగ్

Jagan Campaigners For TDP: టీడీపీకి జగన్ రెడ్డి స్టార్ క్యాంపెయినర్.. నమ్మకపోయినా వాస్తవం మాత్రం ఇదే!

Jagan Campaigners For TDP: వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ స్టార్ క్యాంపెయినర్ గా మారిపోయారు. ప్రజలు నమ్మిన నమ్మకపోయినా ఇదే వాస్తవమని తెలుస్తోంది చంద్రబాబు నాయుడు సూపర్...
- Advertisement -
- Advertisement -