Nithin: ఆ సినిమాలో నటించే ఉంటే నితిన్ జాతకం మాత్రం మారిపోయేదా?

Nithin: టాలీవుడ్ హీరో నితిన్ గురించి మనందరికీ తెలిసిందే. ప్రస్తుతం నితిన్ వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నాడు. కానీ నితిన్ నటించిన సినిమాలు ఊహించిన విధంగా సక్సెస్ ను సాధించలేకపోతున్నాయి. దీంతో సినిమాల ఎంపిక విషయంలో నితిన్ సరిగా లేదని, కథలు ఎంపిక విషయంలో నితిన్ తడబడుతున్నాడని అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఒక హిట్ సినిమా పడితే వరుసగా నాలుగు అయిదు ఫ్లాపులు అవుతున్నాయి. దీంతో అభిమానులు చివరి నిరాశ చెందుతున్నారు. కాగా కెరిర్ మొదట్లో నితిన్ నటించిన దిల్, సై సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచిన విషయం తెలిసిందే.

ఆ సమయంలో నితిన్ కాల్షీట్లు దొర‌క‌డ‌మే క‌ష్టంగా మారింది. అంత క్రేజ్ వ‌చ్చినా తర్వాత సరైన ప్లానింగ్ లేకపోవ‌డ‌మో లేదా ఇతర కారణాలో తెలియదు కానీ నితిన్ వరుసగా 12 డిజాస్టర్స్ ఎదుర్కోవాల్సి వచ్చింది. నితిన్ ఒక్కడే దాదాపు టాలీవుడ్ స్టార్ హీరోయిన్లు, స్టార్ డైరెక్ట‌ర్లు అందరితో సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. వి. వి. వినాయక్, రాజమౌళి, పూరి జగన్నాథ్, త్రివిక్రమ్, కృష్ణవంశీ ఇలా వరుసగా టాప్ స్టార్ డైరెక్టర్స్ అందరితో నటించినా నితిన్ ల‌క్ బాగోక‌ మీడియం రేంజ్ హీరోగానే మిగిలిపోయాడు.

నితిన్ తన సిని కెరియర్లో ఎన్నో సినిమాలను వదులుకున్నాడు.

 

తాజాగా నితిన్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మీరు ఎప్పుడైనా వేరే సినిమా షూటింగ్లో బిజీగా ఉండి సినిమా వదులుకొని బాధ‌ప‌డ్డ సంద‌ర్భాలు ఉన్నాయా ? ప్రశ్నించగా నితిన్ స్పందిస్తూ.. సౌత్ ఇండియన్ సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్ లో బాయ్స్ సినిమాలో నటించే అవకాశం వచ్చింది.. కానీ అదే సమయంలో నేను తేజ ద‌ర్శ‌క‌త్వంలో జయం సినిమా షూటింగ్లో బిజీగా ఉండడంతో డేట్స్ స‌ర్దుబాటు చేయ‌డం కుదరక ఆ సినిమాను వదులుకోవాల్సి వచ్చింది. ఆ సినిమా వదులుకున్నందుకు ఒక మంచి సినిమాని మిస్ అయ్యానే అని బాధప‌డ్డాను అని చెప్పుకొచ్చారు నితిన్. ఒకవేళ నితిన్ మిస్సైన ఆ బాయ్స్ సినిమాను నితిన్ చేసి ఉంటే నితిన్ కెరియర్ మరోలా ఉండేదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు అభిమానులు.

 

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -