LEO Movie: లియోదాస్ ఫ్లాష్ బ్యాక్ నిజం కాదు.. వైరల్ అవుతున్న లోకేశ్ కనగరాజ్ సంచలనా వ్యాఖ్యలు!

LEO Movie:  కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి తాజాగా నటించిన చిత్రం లియో. భారీ అంచనాల నడుమ పాన్ ఇండియా లెవెల్ లో విడుదలైన ఈ సినిమా మిక్స్డ్ టాక్ ని సొంతం చేసుకుంది. అయితే ఇటీవల విడుదల ఈ మూవీ తెలుగుతో పాటు ఇతర భాషల్లో నెమ్మదించింది కానీ తమిళంలో మాత్రం ఆ జోరు ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు దర్శకుడు లోకేష్ కనగరాజ్ దీనికి సంబంధించిన కొన్ని షాకింగ్ విషయాలు వెల్లడించారు. లియో దాస్ ఫ్లాష్ బ్యాక్ లో చూపించిందంతా నిజం కాదని, అది కేవలం మన్సూర్ అలీఖాన్ తన దగ్గరకు వచ్చిన గౌతమ్ మీనన్ కు ఊహించుకొని చెప్పిన గతం అని అది నమ్మాలనే రూల్ ఏమీ లేదని కొత్త ట్విస్టు ఇచ్చాడు.

అలాగే లోకేష్ సినిమాటిక్ యునివర్స్ లో పార్తీబన్, లియో పాత్రలు రెండూ నిజమే కానీ అవి ఒకటా లేక డ్యూయల్ రోలా అనే విషయం మాత్రం ఇప్పుడే బయట పెట్టనని చెబుతున్నాడు. తన కథలో ఏదీ అనవసరంగా ఉండదని, ప్రతి పాత్రకు లింక్ ఉంటుందని మరో ఉదాహరణ కూడా చెప్పాడు. విక్రమ్ మూవీలో వేశ్యగా నటించిన అమ్మాయి లియో కాఫీ షాప్ కి రావడం వెనుక కమల్ హాసన్ ప్రమేయం ఉంటుందని, అదెలా జరుగుతుందనేది డ్రగ్స్ మాఫియా మీద తన హీరోలందరూ కలిసి యుద్ధం చేసినప్పుడు బయట పెడతానని అంటున్నాడు. లోకేష్ మాటలను బట్టి చూస్తే అసలు విలన్ రోలెక్సేనని తేలుతోంది.

లియో దాస్ ఇంట్రో ముందు వేరే విధంగా ప్లాన్ చేసుకున్నారట. వీళ్ళ పొగాకు తోటల మీద తోడేళ్ళ గుంపు దాడి చేస్తే వాటితో లియో ఫైట్ చేయడం ఫస్ట్ రాసుకున్న ఎపిసోడ్. అయితే షూటింగ్ తో పాటు విజువల్ ఎఫెక్ట్స్ కి చాలా సమయం పడుతుంది కాబట్టి అక్టోబర్ రిలీజ్ సాధ్యం కాదనే ఉద్దేశంతో దాన్ని అడవిలో పోలీసులతో సింపుల్ గా మార్చేశారు. సో అనుకున్న దానికన్నా లోకేష్ సృష్టించబోయే సినిమాటిక్ యునివర్స్ ఒక రేంజ్ లో ఉండబోతోందని స్పష్టంగా అర్థమవుతోంది. రజనీకాంత్ తో చేయబోయే సినిమా అయ్యాక ఖైదీ 2, రోలెక్స్ ప్లాన్ చేసుకున్న ఈ దర్శకుడు ఆపై విక్రమ్, లియోలకు కొనసాగింపు చేస్తాడట.

Related Articles

ట్రేండింగ్

Election Campaigns: ఎన్నికల వేళ గరిష్టంగా రోజుకు 5,000 రూపాయలు.. కూలీలకు పంట పండుతోందా?

Election Campaigns: ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల ప్రచారం చూస్తుంటే ఇవి అత్యంత ఖరీదైనవి గా కనిపిస్తున్నాయి. ఎందుకంటే గతంలో ఎన్నికల సమయంలో పార్టీ నాయకుల మీద అభిమానంతో స్వచ్ఛందంగా జనాలు...
- Advertisement -
- Advertisement -