Ram Charan: రామ్ చరణ్ సినిమా కోసం అంత రిస్క్ చేశారా.. ఏం జరిగిందంటే?

Ram Charan: నటుడిగా రాంచరణ్ జర్నీ చూస్తుంటే తండ్రిని మించిన తనయుడుగా తన ప్రయాణాన్ని అద్భుతంగా మలుచుకుంటున్నాడు. నటన కోసం ఏం చేయడానికైనా సిద్ధపడుతున్న రామ్ చరణ్ డెడికేషన్ ఫిదా అవుతున్నారు సినీ అభిమానులు. మెగాస్టార్ కొడుకుగా సినిమాలో ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఎలాంటి భేషజం చూపించకుండా ఒక సాధారణ నటుడు లాగా కష్టపడి పని చేస్తున్నారు అందుకే ఇప్పుడు గ్లోబల్ స్టార్ ఇమేజ్ ని సైతం సొంతం చేసుకున్నారు.

 

నిజంగా రామ్ చరణ్ నటన రంగస్థలం సినిమాలో చూసి తీరాల్సిందే. ఇక ఆర్ఆర్ఆర్ సినిమాలో తన నటనతో ప్రపంచాన్ని తన వైపు తిప్పుకునేలా చేశాడు. ఇప్పుడు ఎందుకు ఈ ప్రస్తావన అంటే గేమ్ చేంజర్ సినిమా కోసం ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి షూటింగ్ చేస్తున్నాడు రామ్ చరణ్. శంకర్ దర్శకత్వంలో వస్తున్న గేమ్ చేంజర్ సినిమాలో రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.

ప్రస్తుతం హైదరాబాదు ఇస్నాపూర్ కెమికల్ ఫ్యాక్టరీలో కీలక షెడ్యూల్ జరుపుకుంటుంది. ఈ షెడ్యూల్లో హీరో రామ్ చరణ్ దాదాపు 12 గంటల పాటు విషవాయువుల మధ్య షూటింగ్ చేశాడట. ఈ సినిమాకి ఈ ఫైటింగ్ అతికీలకం అందుకే ప్రాణాలకు తెగించి మరీ మాస్క్ పెట్టుకొని చరణ్ షూటింగ్ లో పాల్గొనడం జరిగింది. కేరవాన్ లోకి వెళ్లకుండా షూటింగ్ కంప్లీట్ అయ్యేవరకు సెట్స్ లోనే ఉన్నారట రామ్ చరణ్.

 

దీంతో చరణ్ డెడికేషన్ కి సినిమా యూనిట్ మొత్తం ఫిదా అయిపోయిందట. అయితే ఈ విషయం తెలుసుకున్న మెగా అభిమానులు మాత్రం చరణ్ ఆరోగ్యం కోసం ఆందోళన చెందుతున్నారు. అయితే అన్ని జాగ్రత్తలు తీసుకొని, అత్యవసర సేవలు అందుబాటులో ఉంచుకొని షూటింగ్ ని కంప్లీట్ చేశాడట డైరెక్టర్ శంకర్. చరణ్ కెరియర్ లో ఇది 15వ సినిమా. ఈ సినిమా కోసం మెగా అభిమానులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: జగన్ అధికారంలోకి వస్తే ఏపీ ప్రజల భూములు పోతాయా.. బాబు చెప్పిన విషయాలివే!

Chandrababu Naidu: జగన్ మరొకసారి అధికారంలోకి వస్తే ప్రజల భూములను అధికారికంగా కబ్జా చేస్తారని భయం ప్రజల్లో పట్టుకుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి తీసుకువచ్చిన భూ యాజమాన్య హక్కు చట్టం కబ్జాదారులకు అక్రమార్కులకు...
- Advertisement -
- Advertisement -