Shankar-Dil Raju: శంకర్ దెబ్బకు దిల్ రాజు విలవిల.. మొత్తం దుబారా చేస్తున్నారా?

Shankar-Dil Raju: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో వస్తున్నా గేమ్ చేంజర్ చిత్రానికి దిల్ రాజు ప్రొడ్యూసర్ అన్న సంగతి తెలిసిందే. సాధారణంగా దిల్ రాజు ఏ సినిమా నిర్మించినా కూడా బడ్జెట్ విషయంలో పక్కా ప్లానింగ్ తో ఉంటాడు. అందుకే ఆయన చేసిన ప్రతి సినిమా బడ్జెట్లోనే పూర్తవుతుంది. కానీ శంకర్ మాత్రం ఈ గేమ్ చేంజెస్ సినిమా బడ్జెట్ విషయంలో దిల్ రాజ్ కి చుక్కలు చూపిస్తున్నాడట.

ఇండియన్ 2 మూవీ తో చేతులు కాల్చుకున్న తర్వాత అయినా శంకర్ శైలిలో మార్పు వస్తుందేమో అని అందరూ ఆశించారు కానీ శంకర్ ప్రవర్తనలో ఎలాంటి మార్పు లేదు. బడ్జెట్ ప్రకారం సినిమా మొత్తానికి అనుకున్న అమౌంటు ఇప్పటికే ఖర్చు పెట్టేసాడంట శంకర్ ఇంకా వెయ్యి మందితో ఒక యాక్షన్స్ సన్నివేశాన్ని రూపొందించేందుకు దర్శకుడు శంకర్ ఏర్పాట్లు చేస్తున్నాడు. చూడబోతుంటే సినిమా మేకింగ్ కోసం ఇంకా ఒక 100 కోట్లు ఖర్చు అయ్యే అవకాశం ఉంది.

 

అంటే అనుకున్న బడ్జెట్ కన్నా 100 కోట్ల రూపాయలు అదనంగా ఖర్చవుతుంది. ఈ విషయంగా దిల్ రాజు డైరెక్టర్ శంకర్ పై మండిపడుతున్నాడట కానీ సినిమా ఇంకా శంకర్ చేతిలోనే ఉండటం వల్ల ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. రామ్ చరణ్ గత చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకుని ఆయన స్థాయిని అమాంతం పెంచిన సంగతి తెలిసిందే అందుకే ఈ సినిమాపై విపరీతమైన అంచనాలు ఉన్నాయి.

 

కాబట్టి బడ్జెట్ కాస్త ఎక్కువ పెట్టిన పర్వాలేదు అనుకున్నా ఫలితాలు బాగోకపోతే మాత్రం ఆ భారం ఎవరిపై పడుతుంది అన్నది మాత్రం ఆందోళన కలిగించే విషయం. 200 కోట్ల బడ్జెట్ అంచనా తో సెక్స్ పైకి వెళ్ళింది ఆర్ సి 15 దీనికోసం మినిమం రెమ్యూనరేషన్ తీసుకున్నాడు శంకర్ ట్రాఫిక్ లో షేర్ తీసుకునేలాగా అగ్రిమెంట్ చేసుకున్నాడట. మరి ఇప్పుడు బడ్జెట్ చేయి దాటి పోవడంతో పరిస్థితులలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయో వేచి చూడాల్సిందే.

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -