Supritha: రాత్రి పబ్బుల్లో గబ్బు పనులు.. పగలు వృద్ధాశ్రమంలో.. సుప్రీత మామూలు అమ్మాయి కాదంటూ?

Supritha: సురేఖ వాణి, సుప్రీత గురించి చాలామందికి తెలిసిందే. సోషల్ మీడియాలో రీల్స్ పెడుతూ ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉంటారు. సురేఖ వాణి తన కెరీర్ లో ఎన్నో సినిమాలు లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించినా కొంతకాలానికి సినిమాలకు దూరమైంది. అయినా సరే ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన కూతురితో రీల్స్ చేస్తూ వైరల్ అవుతూ వచ్చింది.

వీళ్ళు పెట్టిన ఏ రీల్ కి అయినా ట్రోలింగ్ మామూలుగా ఉండదు ఒక రేంజ్ లో అందరూ వీళ్ళని ట్రోల్ చేస్తారు. వేసుకున్న బట్టలు బాలేదు, పద్ధతిగా లేదు అనే కామెంట్లు ఎప్పుడూ వీళ్ళ ఇన్స్టాగ్రామ్ లో ఉంటాయి. అయితే మొన్న జరిగిన సుప్రీత పుట్టినరోజు నాడు అందరికీ రాత్రి గ్రాండ్గా పబ్ లో పార్టీ ఇచ్చింది. అందులో సురేఖ వాణి కూడా డాన్స్లు చేస్తూ ఎంజాయ్ చేసింది.

 

అక్కడికి సుప్రీత తన తోటి స్నేహితులను కూడా పిలిచి పార్టీ ఇచ్చింది అయితే దాని తర్వాత రోజే ఇద్దరూ వృద్ధాశ్రమానికి వెళ్లి అక్కడ ఉన్న వృద్ధులతో కొంత సమయాన్ని గడిపారు. ఇలా పుట్టినరోజు నాడు వృద్ధులతో సమయాన్ని గడపడం మనసుకు చాలా ప్రశాంతంగా మరియు ఆనందంగా ఉన్నది అని తను ఇంస్టాగ్రామ్ ద్వారా తెలిపింది. దీని మీద ఒక పోస్ట్ ని కూడా పెట్టింది.

 

నా పుట్టినరోజు చాలా బాగా గడిచింది అని అందులో తెలిపింది. ఎప్పుడు ట్రోలింగ్కి గురయ్యి ట్రెండింగ్ గా మారే వీళ్లు ఈసారి ఒక మంచి పని చేసి మళ్లీ ట్రెండింగ్ లో ఉన్నారు. అయితే వృద్ధాశ్రమంలో వాళ్లు ఏమైనా ఫుడ్ డొనేట్ చేయడం లాంటివి చేశారా? అనేది క్లారిటీ లేదు. ఇదిలా ఉండగా సోషల్ మీడియాలో చాలామంది తనకి పుట్టినరోజు అభినందనలు తెలుపుతూ ఇంస్టాగ్రామ్ లో స్టోరీలు ఇంకా స్టేటస్లు పెట్టారు.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -