Actress Surekhavani: బాయ్ ఫ్రెండ్ లో ఆ క్వాలిటీస్ కంపల్సరీ… కోరికలు మామూలుగా లేవు?

Actress Surekhavani: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి సురేఖ వాణి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె ఎన్నో సినిమాలలో తల్లిగా, పిన్నిగా, వదిన, అక్క పాత్రలో నటించి ఎంతోమంది తెలుగు అభిమానులను సొంతం చేసుకున్నారు.ఈ విధంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సురేఖవాణి ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటున్నారు.

2019 వ సంవత్సరంలో తన భర్త సురేష్ తేజ గుండెపోటుతో మరణించినప్పటి నుంచి సురేఖ వాణి తన కూతురు సుప్రీతతో కలిసి ఉంటున్నారు. ఇలా కూతురుతో ఒంటరిగా ఉన్నటువంటి సురేఖ వాణి కరోనా లాక్ డౌన్ సమయంలో సోషల్ మీడియాలోకి అడుగు పెట్టారు.ఇలా సోషల్ మీడియా వేదికగా ఈమె పెద్ద ఎత్తున పొట్టి దుస్తులు ధరిస్తూ ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ పెద్ద ఎత్తున రచ్చ చేశారు. ఇలా తల్లి కూతుర్లు ఇద్దరు కలిసి సోషల్ మీడియాలో ఎన్నో రకాల రీల్స్ చేస్తూ.. ఆ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసి పెద్ద ఎత్తున సందడి చేసేవారు.

ఈ విధంగా తల్లి కూతుర్లు ఇద్దరు కొన్నిసార్లు ధరించిన దుస్తులు కారణంగా పెద్ద ఎత్తున నేటిజన్ ల ట్రోలింగ్ కి కూడా గురయ్యారు.అయితే వాటిని ఏమాత్రం లెక్కచేయకుండా ఈ తల్లి కూతుర్లు సోషల్ మీడియాలో చేసే హంగామా మామూలుగా ఉండదు. ఇకపోతే సురేఖ వాణి భర్త మరణించిన కొన్ని రోజులకు ఆమె రెండవ వివాహం చేసుకోబోతుందని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఇలా సురేఖ వాణి రెండవ పెళ్లి గురించి వార్తలు రావడంతో ఆ వార్తలను ఈమె ఖండించారు.

ఇకపోతే తాజాగా తల్లి కూతుర్లు ఇద్దరు కలిసి యూట్యూబర్ నిఖిల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.ఈ క్రమంలోనే వీరిద్దరూ ఎన్నో రకాల ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు. ముఖ్యంగా ఈ ఇంటర్వ్యూలో సురేఖ వాణి రెండవ పెళ్లి గురించి చెప్పిన సమాధానం హాట్ టాపిక్ గా మారింది. సురేఖ వాణి రెండో పెళ్లి చేసుకోబోతుంది అంటూ నిఖిల్ ప్రశ్నించగా సురేఖ వాణి నో అని సమాధానం చెప్పగా సుప్రీత మాత్రం ఎస్ అనే సమాధానం చెప్పింది.

ఇంట్లో ఒంటరిగా ఉండి బుర్ర తినేస్తుంది..పెళ్లి చేసేద్దాం అంటూ సుప్రీత తన తల్లి రెండవ పెళ్లి గురించి కామెంట్ చేశారు.ఇకపోతే ఈ విషయంపై సురేఖ వాణి స్పందిస్తూ నాకైతే ప్రస్తుతం అలాంటి ఉద్దేశం లేదని భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్పలేము అంటూ సమాధానం చెప్పారు. సురేఖ వాణి మాటలను బట్టి చూస్తుంటే ఈమె ఇప్పుడు కాకపోయినా మరికొద్ది రోజులకి అయినా రెండవ పెళ్లి చేసుకుంటుంది అనడంలో సందేహం లేదు.

ఇకపోతే నిఖిల్ బాయ్ ఫ్రెండ్ గురించి ప్రశ్నలు అడగడంతో సురేఖ వాణి నాకోక బాయ్ ఫ్రెండ్ కావాలంటూనే సమాధానం చెప్పింది. ఈ సందర్భంగా తనకు బాయ్ ఫ్రెండ్ కావాలంటూ ఈమె చెప్పిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.కేవలం బాయ్ ఫ్రెండ్ మాత్రమే కాకుండా బాయ్ ఫ్రెండ్ లో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలో కూడా ఈమె తెలియజేశారు. తనకు కాబోయే బాయ్ ఫ్రెండ్ చాలా హైట్ ఉండాలని, లైట్ గా గడ్డం పెట్టుకొని ఉండటమే కాకుండా బాగా డబ్బులు కూడా ఉండాలని ఈమె చెప్పారు.అలాగే తనని బాగా అర్థం చేసుకునే బాయ్ ఫ్రెండ్ తనకు కావాలని అలాంటి వ్యక్తి కనుక దొరికితే తాను పెళ్లి గురించి కూడా ఆలోచిస్తాను అంటూ ఈ సందర్భంగా ఈమె సమాధానం చెప్పారు. మొత్తానికి సురేఖవాణి చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

News Arena India: మళ్లీ జగనే సీఎం.. మరో సంచలన సర్వే.. న్యూస్ ఎరేనా సర్వేలో వైసీపీ సీట్ల లెక్క ఇదే!

News Arena India: ఏపీలో అధికార వైసీపీ ప్రచారంలో దూసుకుపోతుంది. ఆ పార్టీ అధినేత జగన్ తనదైన సిద్దం సభలను మొదట నిర్వహించి పార్టీ శ్రేణులు, కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. ఆ తర్వాత...
- Advertisement -
- Advertisement -