Temple: ఆలయానికి వెళ్లిన సమయంలో ఈ తప్పులు చేస్తున్నారా.. జన్మజన్మల పాటు పాపం వెంటాడుతుందంటూ?

Temple: మామూలుగా మనం ఆలయాలకు వెళ్లినప్పుడు తెలిసి తెలియక కొన్ని రకాల పొరపాట్లు చేస్తూ ఉంటాం. వాటి వల్ల మనం అనేక రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మరి ఆలయాలకు వెళ్ళినప్పుడు ఎటువంటి తప్పులు చేయకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. దేవాలయానికి వెళ్ళినప్పుడు, దేవుడికి శ్లోకాలని, స్తోత్రాలని, మంత్రాలని జపిస్తారు. పండ్లు, పూలు, పాలు వంటివి పట్టుకెళ్తుంటారు. అగరవత్తులు కూడా వెలిగిస్తారు. కానీ వాటిని అసలు ఊదకూడదు.

దేవాలయంలో అయినా ఇంట్లో అయినా కూడా అగరవత్తులని వెలిగించిన తర్వాత, నోటితో ఊదకూడదు. దేవాలయానికి భోజనం చేసి వెళ్ళకూడదు. తిన్నాక పూజ చేయకూడదు. పూజ చేసుకునే రోజు ఉల్లిపాయతో పాటుగా మాంసాహారం మొదలైన ఆహార పదార్థాలను తినకూడదు. భోజనం చేసి మాత్రం ఎప్పుడూ పూజ చేయకూడదు. దేవాలయానికి వెళ్ళినప్పుడు చిరిగిన బట్టల్ని కట్టుకుని వెళ్ళకూడదు. మొట్టమొదట ఏ దేవుడిని ఆరాధించాలన్నా వినాయకుడిని ఆరాధిస్తూ ఉంటాము. వినాయకుడిని పూజించేటప్పుడు తులసి ఆకులని ఉపయోగించకూడదు.

స్నానం చేయకుండా పూజ చేయకూడదు అలాగే ఆలయాలకి కూడా వెళ్ళకూడదు. పూజకి ఉపయోగించే నెయ్యి ఎప్పుడూ కూడా నీళ్ల మాదిరిగా ఉండాలి తప్ప, గడ్డకట్టినదై ఉండకూడదు. నెయ్యిలో నీటి వాసన అసలు ఉండకుండా చూసుకోవాలి. పూజ చేసేటప్పుడు ఒక దీపాన్ని వెలిగించి, ఆ దీపం సహాయంతో మరొక దీపాన్ని వెలిగిస్తూ ఉంటారు. అలా కూడా చేయకూడదు. అలా చేయడం వలన అనారోగ్య సమస్యలు, పేదరికం వంటివి కలుగుతాయి. కాబట్టి ఆలయానికి వెళ్ళినప్పుడు అలాగే ఇంట్లో ఉన్నప్పుడు ఇంట్లో పూజ చేసేటప్పుడు ఇటువంటి తప్పులు అస్సలు చేయకండి. ఈ పొరపాట్లు చేయకుండా చూసుకోండి.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -