Temple: ఈ గుడిని దర్శించుకుంటే జీవితమే మారిపోతుందా.. ఏం చేయాలంటే?

Temple: మన దక్షిణ భారతదేశంలో ఎన్నో గొప్ప ఆలయాలు ఉన్నాయి. ఇలా దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి ఒక్కో ఆలయానికి ఒక్కో ప్రత్యేకత ఉంది. ఈ విధంగా దక్షిణ భారతదేశంలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి ఆలయాలలో మోపిదేవిలోని సుబ్రహ్మణేశ్వర ఆలయం ఒకటి. స్కంద పురాణంలో కూడా మోపిదేవి గురించి చర్చించడం జరిగింది. ఇలా ఈ ఆలయం యొక్క ప్రత్యేకతలు ఏంటి అనే విషయానికి వస్తే..

 

ఈ ఆలయానికి వెళ్లి స్వామివారిని ఏదైనా కోరిక కోరుకుంటే వెంటనే జరుగుతుందని భక్తుల విశ్వసిస్తారు. అందుకే సుదూర ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు ఈ ఆలయానికి చేరుకొని ఆ స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు.ఇక ఎక్కువగా ఈ ఆలయాన్ని వినికిడి లోపం ఉన్నవారు పెళ్లి కానటువంటి వారు సంతానం లేనటువంటి వారు ఎక్కువగా వస్తుంటారు.

ఈ ఆలయానికి వెళ్లి భగవంతుడిని తమ సమస్య తీర్చమని ప్రార్థిస్తే వెంటనే ఆ కోరిక నెరవేరుతుందని భావిస్తారు. అలాగే జాతక దోష సమస్యలతో బాధపడే వారు కూడా ఈ ఆలయాన్ని సందర్శించి జాతక దోషాల నుంచి విముక్తి పొందాలని ప్రత్యేక పూజలు చేస్తారు. అలాగే మరికొందరు ఆలయంలోనే నిద్ర కూడా చేస్తారు. ముఖ్యంగా సంతానం లేనటువంటి వారు సంతానం కలగాలని ప్రార్థించి ఆలయంలో నిద్ర చేయటం మంచిది.

 

ఈ విధంగా ఆలయంలో నిద్ర చేయటం వల్ల వారికి సంతానయోగం కలుగుతుందని భావిస్తారు. ఇక ఈ ఆలయంలో స్వామివారు లింగ రూపంలో ఉంటుంది. ఈ లింగం చుట్టూ పాము చుట్టుకుని ఉండగా దానిపైన లింగ రూపంలో స్కందడు మనకు దర్శనమిస్తారు. ఇక ఈ ఆలయం విజయవాడ నుంచి రెండు గంటల పాటు ప్రయాణం చేస్తే ఆవనిగడ్డ వెళ్లే దారిలోనే ఈ ఆలయం ఉంది. ఇక్కడ స్వామి వారు ఎంతో మహత్వం కలిగినటువంటి దేవుడిగా పేరు ప్రఖ్యాతలు పొందడంతో పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తుంటారు.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -