Srisailam: శ్రీశైలానికి ఆ నెలలో వెళితే మంచిదా.. ఏం జరిగిందంటే?

Srisailam: రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎక్కువగా సందర్శించే ఆలయాలలో శ్రీశైలం కూడా ఒకటి. శ్రీశైలం ఆలయం గురించి ఎన్నో రకాల విషయాలను చెబుతూ ఉంటారు. శ్రీశైలంలో ఆ ముక్కంటి లింగ రూపంలో కొలువై ఉన్న విషయం తెలిసిందే. కాగా ముఖ్యంగా భౌతిక ఇంద్రియాలతో చూడలేని దివ్యత్వం ఈ ఆలయంలో ఉంది. ఎన్నో జన్మల పుణ్య ఫలితం వలన మాత్రమే ఈ ఆలయ దర్శన భాగ్యం కలుగుతుంది. ఈ విషయం స్కాంద పురాణంలోని శ్రీశైల కాండలో ఉంది. అయితే ఏడాది పొడవునా భక్తులు శ్రీశైలం కి వెళ్లి మల్లన్న ను దర్శించుకుంటూ ఉంటారు.

ముఖ్యంగా మాఘమాసం కార్తీక మాసం వంటి విశేషమైన రోజుల్లో ఎక్కువగా భక్తులు దర్శించుకుంటూ ఉంటారు. అయితే శ్రీశైలం కి ఏ నెలలో వెళ్లడం వల్ల మంచి జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. చైత్రమాసంలో శ్రీశైలం లో ఉండే ఈ మహిమగల ఆలయాన్ని దర్శించుకుంటే, సకల శుభాలు కలుగుతాయి. బహు యజ్ఞాలు ఆచరించిన ఫలితం కలుగుతుంది. ఆయుష్షు పెరుగుతుంది. అలాగే వైశాఖ మాసంలో ఈ ఆలయానికి వెళితే కష్టాలు తీరిపోయి, లక్ష గోవులను దానం చేసినంత ఫలితం మనకు కలుగుతుంది. జేష్ఠ మాసంలో ఇక్కడికి వెళితే గోవులను బంగారంతో అలంకరించి దానం చేసినంత ఫలితం లభిస్తుంది. అదేవిధంగా కోరికలన్నీ కూడా నెరవేరుతాయి.

 

ఇక ఆషాడ మాసంలో శ్రీశైలం కీ వెళితే బంగారు రాశులని దానం చేసినంత ఫలితం కలుగుతుంది. అలాగే కోటి గోవుల్ని శివాలయానికి దానమిచ్చినంత పుణ్యం పొందుతారు. ఇక శ్రావణ మాసంలో ఈ ఆలయానికి వెళితే యోజనం పొలమును పంటతో పాటు, పండితునికి దానం చేసినంత గొప్ప ఫలితం మీకు లభిస్తుంది. భాద్రపద మాసంలో ఈ ఆలయానికి వెళితే కోటి కపిల గోవులను పండితులకు దానం చేసినంత పుణ్యం మీకు లభిస్తుంది. ఆశ్వయుజ మాసంలో ఇక్కడికి వెళితే, వెయ్యి కన్యాదానాలు చేసినంత ఫలితం కలుగుతుంది. పాపాలన్నీ కూడా పోయి, అష్టైశ్వర్యాలు లభిస్తాయి. కార్తీక మాసంలో ఇక్కడికి వెళితే వాజపేయ యాగాలు చేసినంత ఫలితాన్ని పొందొచ్చు. యజ్ఞాలలో అన్నిటికంటే ఇది చాలా గొప్పది. ఇక మార్గశిరమాసంలో ఇక్కడికి వెళితే పౌండరీక యాగం చేసినంత ఫలం మీకు కలుగుతుంది. పాపాలన్నీ కూడా పోతాయి. పుష్య మాసంలో వెళితే మోక్షం లభిస్తుంది. పాపాలన్నీ పోతాయి. మాఘమాసంలో ఇక్కడికి వెళితే శ్రేయస్సు కలుగుతుంది. రాజసూయ యాగం చేసినంత ఫలితం మీకు కలుగుతుంది. ఫాల్గుణ మాసంలో ఇక్కడికి వెళితే తరగని సంపదని పొందొచ్చు. సౌతామణి యాగఫలం కూడా మీకు కలుగుతుంది. ఎనలేని పుణ్యాన్ని కూడా మీరు సంపాదించుకోవచ్చు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -