Temple: ఆలయానికి వెళ్లిన సమయంలో గ‌ర్భ‌గుడి వెనుక భాగాన్ని తాక‌కూడదా.. తాకితే అలాంటి సమస్యలా?

Temple: సాధారణంగా మనం ఏదైనా ఆలయానికి వెళ్ళినప్పుడు అక్కడ దేవుడిని నమస్కరించుకొని స్వామివారి తీర్థప్రసాదాలను అందుకు తిరిగి ఇంటికి వస్తాము. ఇలా ఆలయానికి వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా ఎంతో మనశ్శాంతిని పొందుతారనే విషయం మనకు తెలిసిందే. అయితే మనం ఆలయంలోకి వెళ్ళిన తర్వాత మనకు తెలియకుండానే చాలా పొరపాట్లు చేస్తూ ఉంటాము. ఇలా సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మరి ఆలయానికి వెళ్ళినప్పుడు ఏ విధమైనటువంటి తప్పులు చేయకూడదనే విషయానికి వస్తే..

మనం ఆలయంలోకి వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. ఇలా ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసే సమయంలో చాలామంది ఆలయం వెనుక భాగంలో కూడా నమస్కరిస్తూ ఉంటారు. అయితే ఇలా వెనుక భాగంలో నమస్కరించడం చాలా తప్పు అని పండితులు చెబుతున్నారు. ఇలా ఎప్పుడూ కూడా ఆలయం వెనుక భాగంలో నమస్కరించకూడదు ఇలా నమస్కరిస్తే రాక్షసులను మనం తట్టి లేపినట్టు అవుతుందని పండితులు చెబుతున్నారు.

స్వామివారి దర్శనం అనంతరం తీర్థం చేసుకున్న తర్వాత చాలామంది ఆ చేతిని తలకు రాస్తూ ఉంటారు. అలా తలపై ఎప్పుడూ కూడా రుద్దకూడదు. ఇక స్వామివారి ప్రసాదం తీసుకున్న వెంటనే స్వామివారికి వీపు చూపిస్తూ బయటకు రాకూడదు అలాగే వెనక్కి వెనక్కి వస్తూ ఆలయ గర్భగుడి నుంచి బయటకి చేరుకోవాలి. ఇక స్వామివారి దర్శనమైన తర్వాత చాలామంది వెంటనే ఇంటికి తిరిగి వస్తారు.

ఇలా దర్శనమైన వెంటనే ఇంటికి తిరిగి రాకూడదు కాసేపు ఆలయ ప్రాంగణంలో కూర్చున్న తరువాతనే తిరిగి మనం ఇంటికి రావాలి. ఈ విధంగా ఆలయానికి వెళ్ళినప్పుడు ఈ నియమాలను పాటించడం వల్ల ఏ విధమైనటువంటి అనారోగ్య సమస్యలు కానీ లేదా ఆర్థిక సమస్యలు గానీ ఉండవు. అలా కాకుండా ఇష్టానుసారంగా స్వామివారిని నమస్కరించుకొని రావటం వల్ల పలు సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -